ట్రంప్‌ ‘యుద్ధం’తో భారత్‌కే మేలు

21 Jul, 2018 02:21 IST|Sakshi

విశ్లేషణ

దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. వీటి దిగుమతులు కూడా అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. ఫలితంగా వీటి ధరలు మున్నెన్నడూ లేని రీతిలో పడిపోయాయి. ఇవి పండించే రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు తమ దిగుబడులను అమ్ముకోవాల్సి వచ్చిందని అనేక అంచనాలు చెబుతున్నాయి. పప్పుధాన్యాల దిగుమతిపై సుంకాలు పెంచాలన్న నిర్ణయం వాటిని మనకు ఎగుమతి చేసే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఐరోపా యూనియన్, జపాన్‌ వంటి దేశాలకు ఆగ్రహం కలిగించింది. కానీ ట్రంప్‌ మొదలెట్టిన వాణిజ్య యుద్ధాన్ని ఇండియాలో మళ్లీ వ్యవసాయ పునరుద్ధరణకు ఆయుధంగా, విధానంగా వాడుకోవడం మంచిది.

భారతదేశానికి అవసర మైన బాదం పప్పుల్లో సగం అమెరికా నుంచి ఎందుకు మనం దిగుమతి చేసుకుంటున్నామో నాకు అర్థం కావడం లేదు. బాదం దేశంలో దొరకనిది కాదు. బాదం ఉత్పత్తి కొండ ప్రాంతాలున్న జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌కే పరిమిౖతమెనాగానీ, ఏటా దేశంలో వినియోగించే 97 వేల టన్నుల బాదం పప్పులో అత్యధిక భాగం అమెరికా నుంచే దిగుమతి చేసు కుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన దేశంలోకి దిగుమతయ్యే వివిధ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా వాణిజ్య యుద్ధాలకు తెర తీశారు. అయితే, అంతర్జాతీయ వాణిజ్య విధానంలో అవసరమైన దిద్దుబాట్లకు ఆయన గొప్ప అవకాశం కల్పించారు. ఉక్కు, అల్యూ మినియంపై దిగుమతి సుంకాలు వేయడానికి ట్రంప్‌ నిరాకరించడంతో, ఇండియా దానికి ప్రతీ కారంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 29 ఉత్పత్తులపై ఇండియా దిగుమతి సుంకాలు పెంచింది. వీటిలో బాదం, బఠాణీ, వాల్‌నట్, రొయ్యల లాంటి ఆర్టీ మియా వంటివి ఉన్నాయి.

దేశీయ ఉత్పత్తి పెంపుదలే భద్రతకు హామీ
వ్యవసాయోత్పత్తులపై ఇండియా దిగుమతి సుంకాలు పెంచడంతో దేశంలో వాటి ఉత్పత్తి పెంపు దలను ప్రోత్సహించినట్లే అవుతుందని నేను భావి స్తున్నాను. ఇలా దేశీయ ఉత్పత్తి పెరిగితే ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న కోట్లాది మంది రైతుల బతుకులకు భద్రత లభిస్తుంది. ఆహారం దిగుమతి చేసుకోవడం అంటే నిరుద్యోగాన్ని దిగుమతి చేసు కోవడంగా మనం ఎప్పుడూ భావిస్తున్నాం. బాదం పప్పుపై ఇప్పుడున్న నూరు శాతం దిగుమతి సుంకాన్ని 120 శాతానికి పెంచగా, వాల్‌నట్స్‌పై అదనంగా 20 శాతం విధించారు. అలాగే, యాపిల్‌ పళ్లపై సుంకాన్ని 50 నుంచి 75 శాతానికి పెంచారు. శనగలు, ఎర్ర కందిపప్పుపై సుంకం 30 నుంచి 40 శాతానికి చేరుతుంది. వ్యవసాయోత్పత్తుల దిగుమ తులను సరళతరం చేయడం వల్ల దేశానికి చాలా నష్టం జరిగింది. వీటిపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి ధరలు బాగా దిగజారడంతో దేశంలోకి 2015–16లో రూ.1,402,680,000,000 విలువైన వ్యవసాయోత్ప త్తుల దిగుమతి జరిగింది. అంటే దిగుమతుల విలువ మన వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయించే మొత్తానికి మూడు రెట్లయింది.

దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. వీటి దిగుమతులు కూడా అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. ఫలితంగా వీటి ధరలు మున్నెన్నడూ లేని రీతిలో పడిపోయాయి. ఇవి పండించే రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు తమ దిగుబడులను అమ్ముకోవాల్సి వచ్చిం దని అనేక అంచనాలు చెబుతున్నాయి. 2017–18లో వీటి ఉత్పత్తి రికార్డు స్థాయిలో 240 లక్షల టన్నులకు పెరిగినాగాని దిగుమతులు వచ్చి పడుతూనే ఉన్నాయి. 2016–17లో 66.08 లక్షల టన్నుల పప్పులు దిగుమతి చేసుకోగా, 2015–16లో 57.97 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం. పప్పుధా న్యాల దిగుమతిపై సుంకాలు పెంచాలన్న నిర్ణయం వాటిని మనకు ఎగుమతి చేసే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఐరోపా యూనియన్, జపాన్‌ వంటి దేశాలకు ఆగ్రహం కలిగించింది. దీంతో  భారత్‌ను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వివాదాల పరిష్కార సంఘానికి లాగుతామని ఈ దేశాలు హెచ్చరించాయి.

అన్ని దిగుమతులపైన సుంకాలు అవశ్యం
అయితే, తన ఏకపక్ష వాణిజ్య చర్యలు డబ్ల్యూ టీఓ పరిమితులకు లోబడే ఉన్నాయని ఇండియా వాదించింది. శనగలు, ఎర్ర కందిపప్పుపై ఇండియా దిగుమతి సుంకం పెంచేలా అమెరికా అధ్యక్షుడు చర్యలు తీసుకున్నందుకు  నాకు సంతోషంగా ఉంది. పప్పులపై దిగుమతులపై సుంకాలను ఒక్క అమె రికా విషయంలోనే గాక మొత్తంగా పెంచాలి. మన రైతుల ప్రయోజనాలు కాపాడడమే మౌలిక లక్ష్యం కావాలి. అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రభుత్వాలు భారీగా ఇస్తున్న రాయితీలు స్థానిక రైతులను కాపా డుతున్నాయి. అంతేగాక ఈ సర్కార్ల చర్యల కార ణంగా పప్పుల అంతర్జాతీయ ధరలు తగ్గిపోతు న్నాయి. ఈ దేశాల నుంచి వీటి ఎగుమతులు చౌకగా లభిస్తున్నాయి. అందుకే వర్థమానదేశాలకు చౌక ధర లకు కుప్పలు తెప్పలుగా పప్పుధాన్యాలు వచ్చి పడు తున్నాయి. సబ్సిడీల వల్ల ఇవి పండించే దేశాల రైతులు లబ్ధి పొందుతున్నారు. 

వాల్‌నట్‌ పంటతో జమ్మూకశ్మీర్‌ యువతకు ఉపాధి
వాల్‌నట్‌ సాగు ప్రధానంగా జమ్మూకశ్మీర్‌కే పరిమి తమైంది. దేశంలో మొత్తం వాల్‌నట్‌ ఉత్పత్తిలో 90.30 శాతం వాటా ఈ రాష్ట్రానిదే. తర్వాతి స్థానాలు ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి పర్యత ప్రాంత రాష్ట్రాలవి. దేశంలో కొన్ని సంవత్సరాలుగా వాల్‌నట్‌ సాగు, ఉత్పత్తి తగ్గిపో వడం లేదా పెరగకపోవడం జరుగుతోంది. అయితే, గడచిన కొన్నేళ్లలో అమెరికా నుంచి కాలిఫోర్నియా వాల్‌నట్‌ దిగుమతి ఎన్నో రెట్లు పెరిగింది. 2014–15లో వాల్‌నట్‌ దిగుమతులు అమెరికా నుంచి 85,500 పౌండ్ల మేరకు జరిగాయి. వాల్‌నట్‌ల దిగుమతులు పెరిగేకొద్దీ దేశంలో వాటి ఉత్పత్తికి నష్టం జరిగింది.

భారత ప్రభుత్వం వాల్‌నట్‌ సాగును ఒక్క జమ్మూకశ్మీర్‌లోనే జరిగేలా దృష్టి సారించి, శ్రద్ధ పెట్టి ఉంటే లక్షలాది మంది కశ్మీరీ యువతకు ఆర్థిక ప్రోత్సాహం, ఉపాధి లభించి ఉండేవి. అమెరికాలో నాలుగు వేల మంది వాల్‌నట్‌ ఉత్పత్తిదారులుండగా, అక్కడి ప్రభుత్వం వారి ప్రయోజనాలు కాపాడడానికి చేయాల్సినదంతా చేస్తోంది. ఇండియా కూడా వాల్‌ నట్‌ దిగుమతులపై సుంకాలు పెంచి, సంక్షోభంలో కూరుకుపోయిన కశ్మీర్‌ లోయలో ఆర్థికాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం మంచిది. వాల్‌నట్‌ సాగు పెరిగితే కశ్మీర్‌ ఆర్థిక స్వరూపం మారి పోతుంది. 

జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాదం, వాల్‌నట్, యాపిల్‌ మూడు అత్యంత ప్రధానమైన వాణిజ్య పంటలు. అన్ని దేశాల ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పిం చాలనే వాణిజ్య నిబంధల కారణంగా యాపిల్‌ పండ్ల దిగుమతులకు అవకాశం ఇవ్వడంతో దేశంలో ఈ పంట పండించే రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోకి 44 దేశాల నుంచి యాపిల్‌ పండ్లు దిగుమతి చేసుకుంటున్నారు.

అయితే, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో పండించే యాపిల్‌ పండ్లకు డిమాండ్‌ తగినంత లేకుండా పోతోంది. ప్రస్తుతం యాపిల్‌ పండ్ల దిగు మతులపై విధిస్తున్న సుంకాన్ని 50 నుంచి నూరు శాతానికి పెంచాలని ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఇలా యాపి ల్‌పై దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచితే హిమాచల్‌ ప్రదేశ్‌లోని రూ.3000 కోట్ల యాపిల్‌ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ గట్టిగా నిలబడ గలుగుతుంది. 

ఏదేమైనా, అమెరికా నుంచి చీడపీడలతోనే యాపిల్‌ పండ్లు దిగుమతి అవుతున్నాయి. నానాటికి వాషింగ్టన్‌ యాపిల్‌ పండ్ల దిగుమతులు పెరుగు తూనే ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చే యాపిల్స్‌ 106 రకాల చీడపీడల బారిన పడినవేనని ఇంగ్లండ్‌కు చెందిన వ్యవసాయ, జీవ శాస్త్రాల పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బయోసైన్స్‌ ఇంట ర్నేషన్‌ (కాబి) జరిపిన అధ్యయనంలో తేలింది. అందుకే, నాసిరకం యాపిల్‌ పండ్ల దిగుమతుల దిగుమతులు తగ్గించడానికి సుంకాలకు సంబంధం లేని ఇతర నిబంధనలు తొలగించాల్సిన అవసరం ఉంది. 


ట్రంప్‌ చేష్టలతో భారత్‌కు ఓ రకంగా మేలే
దేశంలో బాదం పప్పులు, వాల్‌నట్, యాపిల్‌ పండ్ల సాగు విస్తరించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశానికి మంచి అవకాశం కల్పించారని చెప్పవచ్చు. ట్రంప్‌ చర్యలను వ్యాపారానికి నష్టం చేసేవిగా పరిగణించ కూడదు. ఇండియాలో వ్యవసాయాన్ని మళ్లీ పున రుద్ధరించడానికి ఆయుధంగా, విధానంగా వాడుకో వడం మంచిది. దేశంలో వ్యవసాయరంగం  తీవ్ర సంక్షోభంలో సాగుతుండగా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను అవసరాలకు అనుగుణంగా మార్చు కుని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిం చాల్సిన సమయం ఆసన్నమైంది.


వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
దేవిందర్‌శర్మ
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు