ప్రతిభను దూరం పెట్టిన ప్రతిష్ట

22 Sep, 2018 02:09 IST|Sakshi
అరుణ్‌ జైట్లీ, నరేంద్ర మోదీ

జాతి హితం

తమకు అవసరమైన, తాము నమ్ముతున్న గొప్ప వ్యక్తులు బయటివారిలో కాకుండా తమ పార్టీలోనే ఉన్నారని నరేంద్రమోదీ, అమిత్‌ షాలు ప్రగాఢంగా విశ్వసించినట్లు కనబడుతోంది. కాని వారి వద్ద ఉన్న గొప్పతనం అనే మూలధనం పరిమితమైనదే. మోదీ ప్రభుత్వంలోని మేధో పెట్టుబడి మూడో సంవత్సరానికే ఆవిరైపోయింది. ఇందిరాగాంధీ కూడా ప్రభుత్వాన్ని తన కార్యాలయం నుంచే నిర్వహించారు. కానీ తన చుట్టూ ఉన్న ప్రతిభావంతుల గురించి ఆమె నిశితంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకునేవారు. నరేంద్ర మోదీ అనే జననేతకున్న ప్రతిష్ట మాత్రమే యావత్‌ దేశ సమస్యలను పరిష్కరించలేదని మూడేళ్లలోపే తేలిపోయింది.

మూడు ప్రశ్నలతో ప్రారంభిస్తాను. నరేంద్ర మోదీ సర్కారు సమర్థు లకు వ్యతిరేకమా? 70 ఏళ్ల పానలో ఇది ప్రతిభా పాటవాలున్న వారిని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించే ప్రభుత్వమా? ఈ అంశం నిజంగా మోదీకి, బీజేపీకి, ఓటర్లకు పట్టదా? మొదటి రెండు ప్రశ్నలకూ జవాబు అవుననే చెప్పాలి. మూడో ప్రశ్నకు సమాధానం చర్చించాకే తేలుతుంది. మొదట కేబినెట్‌ సంగతి చూద్దాం. ఇందులో అనుభవం లేనివారే ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నం దున వాజ్‌పేయి మంత్రివర్గం సహచరుల్లో అత్యధి కులు వృద్ధులనే సాకుతో వారిని బీజేపీ ‘మార్గదర్శక మండల్‌’కే పరిమితం చేశారు.

రాజ్‌నాథ్‌సింగ్, అరు ణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, అనంత్‌కుమార్‌ వంటి యువ నేతలను మోదీ మంత్రివర్గంలో చేర్చుకున్నారు. మౌలిక సదుపాయాల నిర్మాణంలో సొంత రాష్ట్రంలో అనుభవం ఉన్న నితిన్‌ గడ్కరీకి స్థానం లభించింది. అలాగే, పూర్తిస్థాయి కేబినెట్‌లో నాలుగైదు కీలక శాఖలు నిర్వహించే స్థాయికి ఎదిగిన పీయూష్‌ గోయల్‌ కూడా మోదీ కేబినెట్‌ సభ్యుడే. 70 మంది సభ్యులున్న మోదీ కేబినెట్‌లో ఇంతకు మించి చెప్పు కోదగ్గవారెవరూ లేరు. మిత్రులను అడగకుండా మిగి లినవారి పేర్లు చెప్పడం కష్టం. 

మోదీ సర్కారు ఐదో ఏట అడుగుపెట్టినప్పటి నుంచీ నేను జర్నలిజం విద్యార్థుల నుంచి బ్లూచిప్‌ కంపెనీల సీఈఓల వరకూ భిన్న వర్గాలవారితో మాట్లాడుతూ, ‘మన దేశ వ్యవసాయ మంత్రి పేరు చెప్పగలరా?’ అనే ప్రశ్న అడిగేవాణ్ని. జవాబు తమకు తెలుసని చేతులెత్తినవారు లేరు. ఒక వేళ రాధామోహన్‌సింగ్‌ పేరు చెబితే ఆయన ఎవరనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే, ఆయన నేతృత్వంలో వ్యవసాయరంగంలో వృద్ధి శరద్‌పవార్‌ నాయక త్వాన యూపీఏ హయాం నాటి వృద్ధిలో కేవలం సగమే ఉన్నప్పుడు.. ఆయన ఎవరైతే ఏం? అను కోవాల్సి ఉంటుంది. ఐదేళ్లలో వ్యవసాయాదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ 2017 హామీ నిజం కావాలంటే హరిత విప్లవం వంటిది అవసరం.

కాని, ఇండియాలో సైన్స్‌ను, వ్యవసాయ పరిశోధనను పూర్తిగా కాదనుకోవడమేగాక వాటిని అనుమానంతో చూడడం దిగ్భాంతి కలిగించే విషయం. ఇప్పుడు ఈ రంగంలో దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వ్యవ సాయ ప్రయోగశాలల నుంచి శాస్త్రవేత్తలు విదేశాలకు వలసపోయే ప్రమాదం లేకపోలేదు. ఆవు పేడ, మూత్రం, వైదిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులు గొప్పవని ఇప్పుడు ‘గుర్తించడం’ వల్ల ప్రయోజనం లేదు. దేశంలో సస్య విప్లవం సాధించాలనుకున్న ప్పుడు ఇందిరాగాంధీ సామర్ధ్యం, ప్రతిభాపాటవా లున్న సి.సుబ్రమణ్యంను వ్యవసాయమంత్రిగా నియమించారు. మరి రెండో హరిత విప్లవం సాధిం    చడానికి నేటి సర్కారు ఎవరికి బాధ్యత అప్ప గించింది? 

ఇతర రంగాలకు అద్దంపట్టే వ్యవసాయ శాఖ!
ఇతర రంగాల పరిస్థితికి వ్యవసాయ మంత్రిత్వశాఖ చక్కగా అద్దంపడుతోంది. ఆరోగ్యం, రసాయనా లు–ఎరువులు, భారీ పరిశ్రమలు, సైన్స్, టెక్నాలజీ, సామాజికS న్యాయం, చిన్నతరహా పరిశ్రమల శాఖల మంత్రుల పేర్లు చెప్పాలని నేను కలుసుకున్నవారిని ప్రశ్నించాను. సమాధానం లేదు. మన దేశ చరిత్రలో అత్యంత అనామక కేబినెట్‌ ఇదేననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని సామర్థ్యం, నైపుణ్యం ఉన్న నేతలతో తన కేబినెట్‌ను నింపి ఉండాల్సింది. ప్రధాని కార్యాలయం నుంచే పాలనకు, అమలుకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి కాబట్టి అంతా మోదీ చేతిలోనే ఉంది. ప్రధాని దగ్గర సమర్థులు, అంకితభావమున్న ఉన్నతాధికారులున్నారు. అయితే, వారి ఆలోచనల అమలుకు సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానమంత్రి అత్యంత ప్రతిభావంతుడే. ఆయన చెప్పినట్టు దేశంలోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. అయితే, ఓ ఖండమంత ఉన్న భారీ దేశంలో ఎంతటి గొప్ప నాయకుడైనా ఆలోచనంతా ఒక్కడే చేయలేడు. 


ప్రధానికి సలహాలివ్వడానికి ఇంతకు ముందే ఉన్న బృందాలన్నింటినీ రద్దుచేయడం లేదా వాటి ప్రాధాన్యం తగ్గించడం కాకతాళీయం కాదు. నేడు జాతీయ భద్రతా సలహా మండలి(ఎన్‌ఎస్యేబీ)లో ఐదుగురే సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా పనిచేసు కుంటున్నారు. గతంలో అణుశక్తి సిద్ధాంతం సహా అనేక జాతీయ విధానాలను రూపొందించే అత్యంత శక్తిమంతమైన సంస్థగా ఇది పనిచేసేది. రక్షణరంగ నిపుణులు, ప్రజాహిత మేధావులు వంటి విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రముఖులతో ఇది పని చేసేది. అటల్‌బిహారీ వాజ్‌పేయి, బ్రజేష్‌ మిశ్రా నాయకత్వాన ఎన్‌ఎస్‌ఏబీ ఎంతో సాధించింది.

ప్రస్తుతం ఇది జాతీయ భద్రతా సలహాదారుకు సమా చారమందించే సలహాసంఘంగా మారిపోయింది. ప్రధానికి, కేంద్ర కేబినెట్‌కు సలహాలిచ్చే రెండు శాస్త్ర సలహా మండళ్ల పనితీరు కూడా అంతంత మాత్రమే. నిరంతర కృషి జరగడం లేదు. మోదీ ప్రభుత్వం తన ప్రధాన శాస్త్ర సలహాదారును తన ఐదో ఏడాది చివర్లో నియమించింది. ఈ పదవిలో అగ్రశ్రేణి శాస్త్ర వేత్తను నియమించినా గాని, ఆ పదవి స్థాయిని సహా యమంత్రి నుంచి కార్యదర్శి హోదాకు తగ్గించేసింది. ఈ పదవికి ఏపీజే అబ్దుల్‌ కలాం వారసునిగా ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త ఆర్‌.చిదంబరం వచ్చినప్పుడు దీని స్థాయిని కేబినెట్‌ మంత్రి హోదా నుంచి తగ్గించారు. గతంలో కేబినెట్‌ శాస్త్ర సలహా మండలి భారతరత్న ప్రొ.సీఎన్‌ఆర్‌ రావు నాయకత్వంలో నడిచేది. ఇప్పు డిది దాదాపు లేనట్టే. 

నాలుగేళ్లలో ముగ్గురు ఆర్థికవేత్తలు అవుట్‌!
మోదీ ప్రభుత్వం తన నాలుగేళ్లలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన తన నలుగురు ఆర్థికవేత్తల్లో ముగ్గురిని కోల్పోయింది. వారు: రఘురామ్‌రాజన్, అరవింద్‌ పన్‌గడియా, అరవింద్‌ సుబ్రమణ్యన్‌. నాలుగో ఆర్థిక వేత్త ప్రస్తుత రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఇప్పుడు తన సంస్థాగత స్వాతంత్య్రం, వృత్తిపరమైన గౌరవం కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతు న్నారు. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) విష యంలో ప్రభుత్వం చెప్పినట్టు విని తన బాధ్యత విస్మరించారనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ కుంటి నడకతో ముందుకు సాగడంతో ప్రధాని ఆర్థిక సలహా మండ లిని ఆర్బాటంగా పునరుద్ధరించింది. అయితే, ఏం జరుగుతోందో తెలుసా? మండలితో సమావేశం కావడం లేదు. ప్రభుత్వంలో అంతర్భాగమైన ఇద్దరు అధిపతులతోనే ఆయన భేటీ అవుతున్నారు.

వారు: ఆర్థిక శాస్త్రవేత్త బిబేక్‌ దేబ్‌రాయ్, మాజీ ఐఏఎస్‌ అధికారి, వ్యయ విభాగం కార్యదర్శి రతన్‌ వాటాల్‌. ఈ సలహా మండలిలోని మిగిలిన నలుగురు పేరు గొప్పేగాని ప్రయోజనం లేకుండా కొనసాగుతు న్నారు. ప్రధాని పరిశీలనకు అత్యధిక నివేదికలను రూపొందించేది దేబ్‌రాయ్, వాటాల్‌ మాత్రమే. కనీసం ఈ నివేదికల ప్రతులను కూడా మిగిలిన నలుగురికి చూపిస్తారా? అంటే నాకు అనుమానమే. ఈ ప్రభుత్వంలో లోపలివారికే ప్రాధాన్యం. బయటి వారి పాత్ర అలంకారప్రాయమే. ఇదంతా చూస్తే పాండిత్యమంటే సర్కారుకున్న చీకాకు స్పష్టమౌ తోంది. కిందటేడాది ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘కష్టపడి పనిచేస్తే హార్వర్డ్‌ను అధిగ మించవచ్చు’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను బట్టి ఈ విషయం అర్థమయింది.

మొదట విపరీ తంగా కష్టపడితేనే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూని వర్సిటీ(అమెరికా)లో సీటు లభిస్తుంది. భిన్నాభిప్రా యాలకు చోటు కల్పించేలా ప్రభుత్వం ఉంటే– గొప్ప విద్యాసంస్థలైన హార్వర్డ్, ఎంఐటీ, యేల్, జేఎన్యూ లోని అత్యుత్తుమ ప్రతిభావంతులను పిలిచి పద వులు ఇవ్వవచ్చు. అరవింద్‌ సుబ్రమణ్యన్‌ తన పదవి నుంచి వెళ్లిపోగానే ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)పదవిలో నియామకానికి కనీస అర్హతల్లో ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు చేయడం ఆశ్చ ర్యం కలిగించడం లేదు. కొత్త సీఈఏకు ఆర్థికశా స్త్రంలో డాక్టరేట్‌ అవసరం లేదు. కేవలం ‘కష్టపడి పనిచేసినట్టు’ సాక్ష్యాధారాలు చూపిస్తే చాలను కుంటాను.
వాజ్‌పేయి నేతృత్వంలోని మునుపటి ఎన్డీఏ మంత్రివర్గం బీజేపీ అనుకూల ధోరణితో లేదని నరేంద్రమోదీ, అమిత్‌ షా ఇద్దరూ బలంగా విశ్వ సించారు. ఇప్పుడు తమకు మెజారిటీ ఉంది కాబట్టి బయటి వ్యక్తులకు ఎవరికీ చోటు ఇవ్వడానికి వీరు సిద్ధపడలేదు. వాళ్లకు ఏ విశిష్ట ప్రతిభలు ఉన్నప్పటికీ బయటివారికి చోటు ఇవ్వలేదు.

ఇది మన మూడో ప్రశ్నను మళ్లీ చర్చకు తీసు కొస్తుంది. ఇదంతా ఓటరుకు పట్టదా? మంచి నేతలు గొప్ప మనస్సు కలిగి ఉంటారు. కానీ గొప్ప నేతలు విశాల హృదయాలను కలిగి ఉంటారు. ఇందిరా గాంధీ కూడా తన ప్రభుత్వాన్ని తన కార్యాలయం నుంచే నిర్వహించారు. కానీ తన చుట్టూ ఉన్న ప్రతి భావంతుల గురించి ఆమె ఆలోచించేవారు. తమకు అవసరమైన, తాము నమ్ముతున్న గొప్ప వ్యక్తులు తమ పార్టీలోనే ఉన్నారని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు ప్రగాఢంగా విశ్వసించినట్లు కనబడుతోంది. కాని వారి వద్ద ఉన్న గొప్పతనం అనే మూలధనం పరిమితమైనదే. మోదీ ప్రభుత్వంలో మేధో పెట్టుబడి మూడో సంవత్సరానికే ఆవిరైపో యింది. వైద్య విద్యా సంస్కరణ ముసాయిదా రూపొందించడానికి నీతి అయోగ్‌ నాలుగేళ్ల సుదీర్ఘ సమయం తీసుకుంది.

అలాగే ప్రైవేట్‌ కంపెనీలకు బొగ్గు గనులను అమ్మే ప్రక్రియకు కూడా సుదీర్ఘ కాలం పట్టింది. ఈ ఆలస్యానికి పేలవమైన హోమ్‌ వర్క్, తీవ్ర మానసిక ఒత్తిడే కారణం.కీలక రంగాల్లో స్తబ్దత, క్షీణిస్తున్న ప్రతిష్ఠ, అసహనం వంటి రూపాల్లో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం పడుతున్న ప్రసవవేదనను చూస్తుంటే, జర్నలిస్టులు అడిగే హేతుబద్దమైన ప్రశ్నలకుకూడా వారిని మందలించని, బెదిరించని కేబినెట్‌ మంత్రిని బహుశా నేను చూడలేదనే చెప్పాలి. అందుకే మోదీ ప్రభుత్వం రెండో దఫా కూడా సులువుగా అధికారం లోకి వస్తుందని ఏడాది క్రితం ఉన్న జనాభిప్రాయం ఇప్పుడు పెద్ద సందిగ్ధావస్థలో చిక్కుకున్నట్లుంది.

వ్యాసకర్త
ఖర్‌ గుప్తా 
ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు