సామరస్యానికి ప్రొటోకాల్‌ అడ్డు!

14 Jul, 2018 03:27 IST|Sakshi

జాతిహితం

1962 భారత–చైనా యుద్ధం నాటి గందరగోళమే ఇంకా రాజ్య సరిహద్దులో కొనసాగుతోంది. రెండు దేశాల సైనిక దళాల మధ్య పనిచేయాల్సిన హాట్‌లైన్‌ ప్రొటోకాల్‌ సమస్యల్లో చిక్కుకుపోయింది. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదురైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్‌ వైపు నుంచి హాట్‌లైన్‌లో ఎవరు మాట్లాడాలి? భారత్‌ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్యకలాపాల (ఆపరేషన్స్‌) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైనికాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్‌ సమస్య తలెత్తుతుంది.

ఎవరైనా కొన్ని తప్పని సరి పొరపాట్లు చేయడం తప్పుకాదు. అయితే, రక్షణ రంగంలో ఉద్దేశపూర్వక నిష్క్రియాపరత్వం సరి కాదు. ఇక్కడ అవకాశం పోతే దాన్ని సమర్ధించుకో వడం కుదరదు. భారత సైనిక, రక్షణ వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకొచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు వదులుకుంటోంది. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లుగా వాయిదాపడుతున్న సంస్కర ణలు సైనిక రంగంలో అమలు చేయడానికి అవకాశం వచ్చింది. ఈ పని చేయకుండా గత ప్రభుత్వాలను నిందించి ప్రయోజనం లేదు. సైన్యానికి అనుకూల మనే అభిప్రాయం ఉన్న కారణంగా మోదీ సర్కారు చాలా చేస్తుందనే అంచనాలు వేశారు. ఏ ఇతర రంగంలో లేనంతగా రక్షణ రంగ సంస్కరణ విష యంలో కేంద్ర వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక వ్యవ స్థను విప్లవాత్మక మార్పులతో ఆధునికీకరించే అరు దైన అవకాశం లభించినా తన పాలనాకాలంలోని చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏవేవో కొన్ని చిన్నాచితకా చర్యలతో కాలం గడుపుతోంది. తన సైనిక కాల్బలానికి అవసరమైన మౌలిక రైఫిళ్లు, సైనిక దళాలకు ఓ మోస్తరు బూట్లు సమకూర్చడానికి నానా పాట్లు పడుతోంది. వైమానికి దళానికి ఆధునికీకరిం చిన జాగ్వార్‌ యుద్ధ విమానాలు ఇస్తున్నట్టు సగ ర్వంగా చెప్పుకుంటోంది.

కాని మొదట ఈ రకం విమానాలను ప్రవేశపెట్టి 40 ఏళ్లు దాటాయి. సైన్యా నికి ఆయుధాలు, సామాగ్రి సరఫరా చేయడంలో వెనుకబాటు మంచిది కాదు. కానీ, రక్షణ రంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు ఆలస్యం చేస్తే జరిగే నష్టం చాలా ఎక్కువ. ఈ విషయంపైనే ఇండియాను చైనా సూటిగా ప్రశ్నించింది. ‘‘మా వైపున అత్యవసర సమ యంలో మాట్లాడడానికి హాట్‌లైన్‌ను ఎవరు నిర్వ హిస్తారో మాకు తెలుసు. భారత సరిహద్దులో తూర్పు నుంచి పశ్చిమ కొస వరకూ యుద్ధ రంగ కమాండర్‌ ఈ పని చేస్తారు. మరి మీ వైపును ఎవరు చూస్తారు?’’ అని చైనా వేసిన ప్రశ్న ఆందోళనకరం.

భారత సరిహద్దులో చైనాకు ఒకే కమాండర్‌!
భారత సరిహద్దులో మోహరించే చైనా సైనిక దళా లన్నింటికీ ఒకే కమాండర్‌ ఉన్నారు. చైనా బలగాలకు ఒక ఉన్నత సైనిక కమాండర్, ఒక ప్రధాన సైనిక కార్యాలయం ఉంటే, ఇందుకు విరుద్దమైన పరిస్థితి భారత్‌ది. చైనా సరిహద్దున ఉన్న అరుణాచల్, సిక్కిం– భూటాన్‌ ప్రాంతం తూర్పు ఆర్మీ కమాండర్‌ నియంత్రణలో ఉంటుంది. ఉత్తరాఖండ్‌(మధ్య) సెక్టర్‌ మధ్య ఆర్మీ కమాండర్‌ అదుపులో, హిమా చల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతం పశ్చిమ ఆర్మీ కమాండర్‌ నియంత్రణలో ఉంటాయి.

ఇకపోతే, కశ్మీర్‌ మొత్తం, లద్దాఖ్‌ చివరి వరకూ ఉత్తర ఆర్మీ కమాండర్‌ చేతిలో ఉన్నాయి. భారత వైమానికి దళం (ఐఏఎఫ్‌) కూడా తన తూర్పు, మధ్య, పశ్చిమ కమాండ్ల ద్వారా సరిహద్దులో తన విధులు నిర్వహి స్తోంది. అంటే, చైనా సరిహద్దులో మూడు నక్షత్రాల హోదా ఉన్న కనీసం ఎనిమిదిమంది భారత సైనిక కమాండర్లు ఒకే ఒక చైనా కమాండర్‌తో విధుల నిర్వహణలో పోటీపడుతుంటారన్న మాట. ఆధునిక సైన్యాన్ని నడిపించే విధానం ఇది కాదు. రెండు దేశాల సైనిక దళాల మధ్య పని చేయాల్సిన హాట్‌లైన్‌ ప్రొటోకాల్‌ సమస్యల్లో చిక్కుకుపోయింది.

రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహ ద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదు రైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్‌ వైపు నుంచి హాట్‌లైన్‌లో ఎవరు మాట్లాడాలి? భారత్‌ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్య కలాపాల (ఆపరేషన్స్‌) డైరెక్టర్‌ జనరల్‌(డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైని  కాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్‌ సమస్య తలెత్తు తుంది.

మన మొత్తం సైనిక(ఆర్మీ) దళాల డీజీఎంఓ చైనాకు చెందిన ‘కేవలం’ యుద్ధరంగ(థియేటర్‌) కమాండర్‌తో మాట్లాడడం కుదురుతుందా? అనే ప్రశ్న మన సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇది కేవలం ప్రొటోకాల్‌కు సంబంధించినదే అయితే హాస్యాస్పదం కాదా? ఆధునిక యుద్ధంలో వేగం, పోరు తీరు, శరవేగంతో దళాలు, ఆయుధాల తర లింపు, ఆయుధాల పనితీరు, సమన్వయంతో కూడిన యుద్ధ వ్యూహాలు అత్యంత కీలకమైనవి. మన మౌలిక సైనిక వ్యవస్థలను బ్రిటిష్‌వారు మనకు అప్పజెప్పి వెళ్లిన స్థాయిలోనే ఇప్పటికీ కొనసాగు తున్నాయి.

బ్రిటిష్‌ పాలనలో ఏర్పాటైన సైనిక కంటోన్మెంట్లే ఇంకా పనిచేస్తున్నాయి. ఇటీవల మాజీ నౌకాదళ అధిపతి అరుణ్‌ ప్రకాశ్‌తో మాట్లాడిన ప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన విషయం వెల్లడిం చారు. ‘‘డొక్లామ్‌ సరిహద్దులో చైనాతో పోరాటం మొదలై ఉంటే–ఐదు రకాల భారత సైనిక విభా గాలు(కమాండ్లు) చైనా ఆర్మీతో తలపడాల్సివచ్చేది. వివిధ భారత విభాగాల మధ్య సమన్వయం సమస్యే. అదే చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఒకే కమాండ్‌ కింద ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా భారత దళాలతో పోరాడేది,’’ అని ఆయన చక్కగా కీలక పోరు సమస్యను వివరించారు. స్వల్ప కాలంలో, కొద్ది ప్రదేశంలో జరిగే భీకరపోరులో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలం?

19 విభిన్న కమాండ్లుగా భారత సైన్యం!
భారత సైనిక దళాలను ప్రస్తుతం 19 విభిన్న విభా గాలుగా(కమాండ్లు) విభజించిందీ అరుణ్‌ప్రకాశ్‌ వివరించారు. ఏ రెండు సైనిక కమాండ్లూ ఏక లక్ష్యంతో, ఒకే ప్రాంతంలో లేవని ఆయన చెప్పారు. ఇంతటి అధ్వాన స్థితిలో సైనిక వ్యవహారాలు నడు స్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే తూర్పు ఆర్మీ కమాండ్‌ కోల్‌కతాలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద గ్రూపులను అదుపులో పెట్టే బాధ్యత కూడా దీనిదే.

ఈ ఆర్మీ కమాండ్‌తో సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన తూర్పు వైమానిక దళ కమాండ్‌ విచిత్రంగా యుద్ధ విమానాలు దిగే ఎయిర్‌స్ట్రిప్‌ కూడా లేని ప్రాంతంలో ఉంది. సుందరమైన పర్వతా లకు నిలయమైన ఎగువ షిల్లాంగ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటే ఎంత ఇబ్బందికరంగా ఉందంటే–కోల్‌కతా నుంచి వేగంగా విమానంలో షిల్లాంగ్‌ వెళ్లాలంటే బంగ్లాదేశ్‌ గగనతలంపై పయ నించాల్సి ఉంటుంది. ఆర్మీ కమాండ్‌ ఉన్న కోల్‌కతా లోనే దీన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని బ్రిటిష్‌ వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక తూర్పు నౌకాదళ కమాండ్‌ విషయానికి వస్తే ఇది దక్షిణాన విశాఖపట్నంలో ఉంది. తూర్పు రంగంలో మాత్రమే ఇంతటి గందర గోళ పరిస్థితులున్నాయంటే పొరపడినట్టే. పశ్చిమ కమాండ్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పశ్చిమ ఆర్మీ కమాండ్‌ చండీగఢ్‌ నగరం శివార్లలోని చండీమంది ర్‌లో ఉంది. కాగా, పశ్చిమ వైమానికి దళ కమాండ్‌ ఢిల్లీ నుంచి పనిచేస్తోంది. భారత వైమానిక దళా ధిపతి ప్రధాన కార్యాలయం, అతి పెద్ద కమాండ్‌ ఒకే నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ రెండింటికి మధ్య దూరం కేవలం ఐదు మైళ్లే.

ఇలా దేశంలోని సైనిక కమాండ్ల జాబితాలు, వివరాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అన్ని కమాండ్లలోనూ ఒకే రకమైన అవ్వవస్థ రాజ్యమేలు తోంది. దక్షిణ ఆర్మీ కమాండ్‌ పుణె నగరంలో ఉండగా, పాకిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్‌– రాజస్థాన్‌ ఏడారి ప్రాంతం రక్షణ బాధ్యత దీనికి అప్పగించారు. కాని, దీనికి తోడ్పడాల్సిన నైరుతి వైమానికి దళ కమాండ్‌ గాంధీనగర్‌ నుంచి పని చేస్తోంది. ఇంకా, వైమానిక దళ దక్షిణ కమాండ్‌ తిరు వనంతపురంలో ఉంది. దీనికి మొత్తం ద్వీపకల్ప ప్రాంత రక్షణ బాధ్యత కల్పించారు.

ఆర్మీ నైరుతి కమాండ్‌ జైపూర్‌లో ఉండగా, దానికి సాయమం దించే వాయుసేన ప్రధానకార్యాలయాలు ఢిల్లీలో (పశ్చిమ), గాంధీనగర్‌లో ఏర్పాటై ఉన్నాయి. అల హాబాద్‌(మధ్య)లోని వైమానిక దళ కమాండ్‌ కూడా దీనితో కొన్నిసార్లు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, ఏ రెండు కమాండ్లూ ఒక చోట నుంచి, ఒకే లక్ష్యంతో పని చేయడం లేదని స్పష్టమౌతుంది. ఒక్క అండమాన్‌ దీవుల్లో మాత్రమే త్రివిధ బలగాల కమాండ్‌లు ఒకేచోట కేంద్రీకృతమై పనిచేస్తున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కొత్త సమీకృత కమాండ్లు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయని చెప్పవచ్చు.

చివరి సంవత్సరంలో హడావుడి
ఇంతటి గందరగోళ పరిస్థితుల మధ్య ఇప్పటికే ఎక్కువగా విస్తరించి ఉన్న ఆర్మీ తూర్పు కమాండ్‌ ఆజమాయిషీలో కొత్తగా మౌంటెన్‌ స్ట్రయిక్‌ కోర్‌ అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పెట్టారు. పైన వివరించిన ఆందోళనకరమైన విషయాలు ‘ద ప్రింట్‌’ వెబ్‌సైట్‌లో వెల్లడవడంతో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త దళం ఏర్పాటు విషయాన్ని ఆర్మీ నిర్ణయానికే వదిలేశామని ఆమె చెప్పారు. ఆర్మీ చీఫ్‌ అనవసరంగా సైనిక కమాం డ్‌లను విస్తరించే కన్నా ఉన్న వాటిని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంతో తెగువ, తెలివితేటలు ప్రద ర్శిస్తున్నారని భావిస్తున్నాను.

మరో ముఖ్య విషయం ఏమంటే, సైన్యానికి సంబంధించిన మౌలిక సంస్థా గత విషయాలపై మంత్రి స్పందన. సంయుక్త యుద్ధ రంగ కమాండ్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం అనుకూలమని ఆమె చెప్పారు. ఈ విషయం మనం గతంలో ఎన్ని సార్లు విన్నాం?  ఈ విషయంలో ముందుకు సాగడానికి ఇదివరకటి ప్రభు త్వాలకు రాజకీయ బలం లేదు. మరి మోదీ ప్రభు త్వం ఈ నాలుగేళ్లలో ఈ పనిచేయకుండా ఎవరు అడ్డుకున్నారు? మొదటి నాలుగు సంవత్సరాలూ కళ్లు మూసుకున్న మోదీ ప్రభుత్వం చివరి దశలో హడావుడి చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యస్థలో పరిపా లన అంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌ కాదు.

వ్యాసకర్త: శేఖర్‌ గుప్తా, దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

>
మరిన్ని వార్తలు