న్యాయ వ్యవస్థ పయనం ఎటు?

17 Apr, 2018 01:05 IST|Sakshi

రెండో మాట

‘న్యాయస్థానం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు ఆచరణలో కనిపించాలి. ఉన్నత న్యాయస్థానంలో ఆసీనులైన న్యాయమూర్తుల నడత కూడా న్యాయవ్యవస్థ నిష్పాక్షికతలో ప్రజల విశ్వాసం పాదుకొనేలా, దానిని రూఢి పరిచేలా ఉండాలి. ఈ విశ్వసనీయతను తుడిచిపెట్టేసే విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల చర్యలు ఉండరాదు.’
 – (‘న్యాయమూర్తుల జీవన విలువల పునరుద్ఘాటన’ పేరుతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంయుక్త సమావేశం చర్చించి ఆమోదించి మే 7,1997న విడుదల చేసిన ప్రకటన పత్రం)
‘జ్ఞానం కత్తి వంటిది. దాని విలువ ఆ జ్ఞానాన్ని వినియోగించుకునేవాడి చేతులలో ఉంటుంది. చదువులేని వాడు ఎదుటివారిని వంచించగల శక్తి గల వాడు కాదు. ఎవరినీ మోసగించే ‘కళ’ అతనికి తెలియదు. కానీ చదువుకున్న వాడు మాత్రం నిజాన్ని అబద్ధంగానూ, అబద్ధాన్ని నిజంగానూ తన వాదనా బలం చేత తారుమారు చేయగలడు. ఈ వంచనా శిల్పంతోనే చదువుకున్నవాళ్లు ప్రజలను మోసగిస్తూ ఉంటారు.’
– డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టుకూ మధ్య ఇటీవల తరచూ కొన్ని అంశాల మీద ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నది. అది భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు, ప్రజలు తమకు తాము అంకితం చేసు కుంటూ ఆమోదించిన సెక్యులర్, సోషలిస్ట్, గణతంత్ర ప్రజాస్వామ్య సూత్రాల ద్వారా అవతరించిన రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించే వాతావరణం అనిపించదు. వివిధ సవరణల ద్వారా (ప్రగతిశీలమైనవీ, అలా అనిపించుకో లేనివీ) చొచ్చుకు వచ్చిన భావాలతో న్యాయస్థానాలకు, పాలకపక్షాలకు మధ్య అవాంఛనీయ వాతావరణం నెలకొంటున్నది. డాక్టర్‌ అంబేడ్కర్‌ తది తరులు రూపొందించిన రాజ్యాంగానికి తరువాతి కాలాలలో తూట్లు పడడా నికి కారణం ఇదే. ప్రభుత్వాన్ని నిర్వహించే పాలకపక్షానికీ (బ్రాండ్‌ ఏదైనా) శాసన వేదికలకూ న్యాయస్థానాలకూ రాజ్యాంగం బాధ్యతలను విభజిం చింది. అయితే న్యాయస్థానాలకు మరొక అదనపు బాధ్యతను కూడా అప్ప గించింది. అదే– ప్రభుత్వ నిర్ణయాలను, చట్టసభ సభ్యుల నిర్ణయాలను పరిశీ లించి, వాటిలోని తప్పొప్పులను కనిపెట్టి వాత పెట్టడమే.

రాజ్యాంగం మార్చే కుట్ర
బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకూ వీటి మీద పౌర సమాజం నుంచి వెల్లువె త్తుతున్న రిట్‌ల ఆధారంగా కోర్టులకు ఉన్న సర్కారును ప్రశ్నించే అధికారానికీ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఇందుకు మూలాలు అత్యవసర పరిస్థితి కాలంలో లభిస్తాయి. తన ఇష్టానుసారం జరిగిన నిర్ణయాలకు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదముద్ర వేయించడానికి నాటి కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని న్యాయవ్యవస్థను వినియోగించుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్నీ, అందులోని ప్రజాస్వామిక నిబంధనలనీ మత ప్రాతిపదికపైన మార్చేందుకు లేదా సవరించేందుకు బీజేపీ పాలనలో ప్రయత్నం జరుగుతున్నది. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగించే విధంగా పావులు కదపడం ఇందుకు తొలిమెట్టు. న్యాయవ్యవస్థ ప్రత్యేకంగా నెలకొల్పుకున్న కొలీజి యంకు విరుద్ధంగా నేషనల్‌ జ్యుడీషియల్‌ కొలీజియంను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది న్యాయ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యంగా భావించిన న్యాయవ్యవస్థ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇదే చినికి చినికి గాలివాన అయింది. 

సుప్రీంకోర్టు కొలీజియం (సమష్టి వ్యవస్థ) నిర్మాణంలో కూడా లొసు గులు ఉన్నాయనీ, ముందు వాటిని సవరించుకోవాలనీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ సూచించారు. అంతేగాని మోదీ ప్రభుత్వం నేషనల్‌ కొలీజియం ప్రతిపాదనను ఆయన సమర్థించలేదు. అయితే అత్యున్నత న్యాయస్థానం నిర్మాణ సూత్రాల మేరకు ప్రధాన న్యాయమూర్తిని ‘సమాను లలో సమానుడు’గానే  భావిస్తూ, న్యాయస్థానం అధిపతిగా గుర్తించారు. కోర్టు పరిశీలనకు వచ్చిన కేసులను ధర్మాసనాలకు కేటాయించే అధికారం  అప్పగించారు. ఈ కేటాయింపులలో పక్షపాతం లేకుండా సీనియారిటీని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాజ్యాలను ధర్మాసనాలకు కేటాయించాలన్నది వ్యవహార న్యాయం. ఈ న్యాయం ఎక్కడో దారి తప్పినందునే జస్టిస్‌ చల మేశ్వర్‌ సహా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాహసించి పత్రికా గోష్టిని నిర్వహించవలసి వచ్చింది. సుప్రీం లోని నడవడికను బహిర్గతం చేస్తూ దేశాన్నీ ప్రజలనూ జాగరూకం చేయ వలసి వచ్చింది. చలమేశ్వర్‌ ప్రభృతుల నిర్ణయం సబబా కాదా అన్నది ఆ తరువాత కొలది రోజుల్లోనే జరిగిన పరిణామం నిరూపిస్తోంది.

సంఘర్షణ, సర్దుబాటు
న్యాయస్థానం పరిధిలోకి చొరబడే పాలకులకు హెచ్చరికగా 17వ శతాబ్దపు ఇంగ్లండ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కోక్‌ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. ఆయన కోర్టు పరువును కాపాడిన తీరు ప్రశంసనీయం. జస్టిస్‌ కోక్‌ను నియ మించింది జేమ్స్‌ రాజే, అయినా కోక్‌ను నియంత్రించడానికి ప్రయత్నిం చాడు. ‘నీవు ప్రధాన న్యాయమూర్తివే అయినా పాలకుడిని కాబట్టి కోర్టుల్లో జోక్యం చేసుకుని నేను ఏ కేసునైనా సరే కోర్టుల పరిధి నుంచి తప్పిం చేయగలను’ అని ప్రకటించాడు. అప్పుడు జస్టిస్‌ సి.జె. కోక్‌ ‘పాలకుడికి ఆ అధికారం లేదు, ఇంగ్లండ్‌ చట్టం ప్రకారమే న్యాయస్థాన నిబంధనల ప్రకా రమే, న్యాయచట్టం ప్రకారమే కేసులు పరిష్కారమవుతాయి’ అని ప్రకటిం చాడు. ఈ మాటను  అవమానంగా భావించిన జేమ్స్, ‘అంటే, మీ ఉద్దేశం నేను చట్టానికి లొంగి ఉండాలా? ఇది దేశద్రోహం’ అన్నాడు. అందుకు జస్టిస్‌ కోక్, ‘మీరు పాలకులు, మీరు ఏ వ్యక్తికీ లోబడి ఉండొద్దు. కానీ, చట్టానికి మాత్రం లోబడి ఉండాల్సిందే!’ అన్నాడు. కానీ ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న లార్డ్‌ మాన్స్‌ఫీల్డ్‌ (18వ శతాబ్దం) తన సోదర జడ్జీలతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంగ్లిష్‌ ధర్మాసనం కలకలా నికి గురయింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హ్యూవర్ట్‌ (1922–40) తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అభాసుపాలైనాడు. ఇలా రెండు రకాల ఉదాహరణలున్నాయి. మన దేశ తాజా పరిణామాలు కూడా మరొకలా లేవు. 

కొన్ని కేసుల విషయంలో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావిస్తూ, ప్రజల దృష్టికి తెస్తూ  జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రభృతులు (నలుగురు)చేసిన విన్నపం ఒక ఆలోచనా ధార విజయమని చెప్పకపోయినా, ప్రతిఫలమా అన్నట్టు తాజాగా ఐదుగురు సుప్రీం న్యాయమూర్తులు కూడా (ఎస్‌.ఎ. బాబ్డే/ ఎన్‌.వి. రమణ/ యు.వి. లలిత్‌/ డి.వై. చంద్రచూడ్‌/ ఎ.కె. సిక్రీ) రంగంలోకి దిగి వివిధ ధర్మాసనాలకు కేసుల కేటాయింపు గురించి ప్రధాన న్యాయమూర్తితో పాటు, నలుగురు (చలమేశ్వర్‌ ఆధ్వర్యంలో) న్యాయమూర్తులతోనూ చర్చలు జరపడం శుభసూచకమే. కేసుల కేటాయింపు విషయంలో నిర్ణయానికి కమి టీని వేయాలన్న ఐదుగురు న్యాయమూర్తుల ఆలోచన మంచిదే. అయితే– చల మేశ్వర్‌ ఆధ్వర్యంలో ఆవేదన వెలిబుచ్చిన నలుగురు న్యాయమూర్తులు కేసుల పరిశీలనలో జరుగుతున్న అస్తవ్యస్త వ్యవహారాలను సరిదిద్దడానికి, పాలక రాజ కీయ పెద్దలకు సంబంధం ఉన్న లేదా వారు ఇరుక్కున్నట్లు భావిస్తున్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యానికి, ధర్మాసనానికి కేసుల (తీవ్రమైన ఫిర్యా దులున్న కేసులు)ను విచారణకు నివేదించడంలో జరుగుతున్న తడబాటు గురించి అన్యాపదేశంగా కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారని సమాచారం. ఉదా హరణకు సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు. ఇందులో బీజేపీ నేత అమిత్‌ షా జైలు పాలైనా కేసు కొట్టివేయడంతో విడుదలయ్యారు. పాత కేసు తిరిగి సీబీఐ స్పెషల్‌ జడ్జి లోయా కోర్టులో విచారణకు వచ్చింది. ఆ వెంటనే లోయా ఆకస్మి కంగా మరణించారు. జస్టిస్‌ లోయా మృతి కేసు నేను, ఇతర పాత్రికేయులు వేసిన ‘పిల్‌’ ఆధారంగా సుప్రీంలో విచారణకు వచ్చింది. ఈ కేసు పర్య వసానాన్ని ఇప్పట్లో ఊహించలేం.

ముందుకు వెళ్లిన చర్చ
ఈ సమయంలోనే ఐదుగురు గౌరవ న్యాయమూర్తులు సుప్రీం ధర్మాసనాలకు ప్రధాన న్యాయమూర్తి కేటాయించాల్సిన కేసులపై ప్రతిపాదనలు చేశారు. కానీ నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన కేసుల కేటాయింపు పరిష్కారా నికి, ఐదుగురు న్యాయమూర్తులు కొత్తగా ప్రతిపాదించిన పరిష్కారానికి మౌలికమైన తేడా కనిపిస్తోంది. ఎందుకంటే, మధ్యవర్తులలో(ఐదుగురు) ఒక రైన గౌరవ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఏప్రిల్‌ 11న ఒక తీర్పు చెప్పారు: ‘కేసులను వివిధ ధర్మాసనాలకు కేటాయించి, బెంచ్‌లను ఏర్పాటు చేసే ప్రత్యేక విశి ష్టాధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది’ అని స్పష్టం చేశారు. అంటే కేసులు ఏ బెంచ్‌కి నివేదించాలో నిర్ణయించే విశేషాధికారం (మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌) ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందని పునరుద్ఘాటించారు. అసలు ప్రశ్న ప్రధాన న్యాయమూర్తి ఏ బెంచ్‌కి ఏ కేసును పరిశీలనార్థం నివేదించాలో నిర్ణ యించే అధికారం ఆయనకు ఉన్నా, ఆయన రాజ్యాంగ ధర్మాసన న్యాయ మూర్తులలో సమానుల మధ్య సరిసమానుడైన వ్యక్తి కాబట్టి, కేసుల కేటా యింపులు సహ న్యాయమూర్తులతో చర్చించిన తరువాతనే కేటాయించాలని జస్టిస్‌ చలమేశ్వర్, మిగిలిన నలుగురి వాదన.

అందుకనే, భావితరాల భద్రత కోసం న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని రక్షించుకోవాలని చలమేశ్వర్‌ కోరు కుంటున్నారు. అంతేగాదు, పౌర స్వేచ్ఛ, పౌరుడి తిండీ తిప్పల గురించి, మత స్వేచ్ఛ గురించీ పత్రికా స్వేచ్ఛ గురించీ ఆంక్షలు విధించే పాలకులను ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకునే హ్యూగో బ్లాక్‌ లాంటి మహా మహా అమె రికన్‌ న్యాయమూర్తులు, అత్యున్నత న్యాయస్థానం ద్వారా సేవలు అందిం చిన గజేంద్ర గాడ్కర్, సవ్యసాచి, వి.ఆర్‌. కృష్ణయ్యర్, చిన్నప్పరెడ్డి లాంటి ఉద్దండులు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యం అసాధారణం. అందుకే జస్టిస్‌ హ్యూగో బ్లాక్‌ ఇలా ప్రకటించాడు: ‘భావ ప్రకటనా స్వేచ్ఛకు అసలైన అర్థం– ఎదుటివారు అభిప్రాయాల్ని ప్రకటించినందుకు, వారు ఉచ్చ రించే మాటలకు లేదా రాసే రాతలకు నీవు వారిపట్ల హాని తలపెట్టడం కాదు. అదే నా నిశ్చితాభిప్రాయం, ఇందులో మినహాయింపులు లేవు. ఇదే, నా అభిప్రాయం’. ‘మన అధికారాల్ని మన సొంత గౌరవ, మర్యాదల్ని రక్షించు కోడానికి వినియోగించరాద’న్నాడు జస్టిస్‌ డెన్నింగ్‌ (ఇంగ్లండ్‌)! అవును కదా– ‘‘క్షేమం అవిభాజ్యం అన్నందుకే/జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో న్యాయం నాలుగు పాదాల నడుస్తుందనుకోవడం అత్యాశే’’!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in  

మరిన్ని వార్తలు