ముంచుకొస్తున్నది పర్యావరణ ప్రళయం

8 Nov, 2019 01:04 IST|Sakshi

విశ్లేషణ

ఢిల్లీని జాతీయ రాజధానిగా ప్రేమిస్తాం. అది కాలుష్యానికి రాజధాని. ఇక్కడ ఇంధన వనరుల వినియోగం, విపరీతంగా పెరిగిపోతున్న జనసంఖ్య, చెట్లను ధ్వంసం చేసి నేలను చదునుచేసి, కార్బన్‌ విసర్జన పరిమాణాన్ని నిరంతరం పెంచే దుర్భర కార్యక్రమం జరుగుతున్న దారుణమైన ప్రదేశం ఢిల్లీ. వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రపంచం వ్యాప్తమై ఉందని 11 వేల మంది శాస్త్రజ్ఞులు 153 దేశాల నుంచి మనందరినీ హెచ్చరిస్తున్నారు. మన నవ నాగరిక జీవనానికి ఊపిరులూదుతున్న ఆక్సిజన్‌ను హరించి, హరిత హరణ విసర్జనలతో పర్యావరణాన్ని ఊహాతీతంగా పతనం చెందిస్తున్న మానవ దైనందిన కార్యక్రమాలలో సమూలమైన మార్పులు రాకపోతే మన సంగతి ఇంతే అని శాస్త్రజు్ఞలు వివరిస్తున్నారు.  

ఒకరు కాదు ఇద్దరు కాదు 11,258 మంది ఈ వాతావరణ సూచిక మీద హెచ్చరిక సంతకాలు చేశారు. వారిలో 69 మంది మన భారతీయులు. మనం ఏం చేస్తే బాగుంటుందో కూడా వివరించారు. మనం ఏ విధంగా బ్రతకాలో నిర్ణయించుకునే దాన్ని బట్టి మన నిలకడైన భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. మన ప్రపంచ సమాజం సహజ పర్యావరణ పరిసరాలతో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎంత త్వరగా తన వ్యవహార ధోరణి మార్చుకుంటుందో దాన్ని బట్టి మన మనుగడ ఆధారపడి ఉంటుంది. మనకు గడువు లేదు. పర్యా వరణ సంక్షోభం అంతకంతకూ మరింత సంక్లిష్ట మవుతున్నది. పతనం ప్రమాదకరవేగంతో సమీపిస్తున్నది. అనుకున్నదానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.  

1979లో మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశం జెనీవాలో జరిగింది. ఆ సభ నలభైవ వార్షికోత్సవ సందర్భంగా బయో సైన్స్‌ జర్నల్‌లో వారు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి వారు ప్రతిపాదించిన మొదటి అంశం జనాబా పెరుగుదల రేటును వెంటనే పూర్తిగా అరికట్టడం. ఇది ముఖ్యంగా భారత్, చైనా దేశాలు గుర్తించి ఆచరణాత్మక పథకాలు అమలు చేయవలసి ఉంది. రెండోది భూగర్భ ఇంధనాలను భూమిలో మిగల్చడం. శరవేగంగా సాగుతున్న అడవుల నరికివేతను వెంటనే ఆపాలి. అంతేకాదు మాంసం తినడాన్ని కూడా చాలావరకు తగ్గించాలి. విపరీతంగా పర్యావరణంలో వస్తున్న మార్పులను చూసి ఈ హెచ్చరిక చేయాలనే నిర్ణయానికి వచి్చనట్టు ప్రొఫెసర్‌ విలియం రిపిల్‌ వివరించారు. పర్యావరణం ఈ విధంగా విచి్ఛన్నమవుతున్న విషయం జనులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేయవలసి వచ్చిందని ఓరేగావ్‌ రాష్ట్ర యూని వర్సిటీకి చెందిన రిపిల్‌ అన్నారు. భూ ఉపరితల, సముద్ర ఉపరితల వాతావరణం వేడెక్కుతున్నది. సముద్రమట్టం పెరగడం, తీవ్ర ప్రమాదకరం. మనం నలభై సంవత్సరాలుగా ఈ అంశాలను చర్చిస్తున్నాం. కాని చాలా మటుకు ఈ ప్రమాదాన్ని పసి గట్టి నివారించడంలో విఫలమయ్యాం. ఏవో కొన్ని చిన్న చిన్న విజయాలు తప్ప భారీ పరాజయాలే దాదాపు అంతటా ఎదురయ్యాయి.

పర్యావరణంలో ఉపసంహరించడానికి వీల్లేని మార్పులు జరుగుతున్నాయి. మనం ఆ పరిస్థితులను మార్చలేం. ఎకో విధానాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. మామూలు ప్రజలను, విధాన విధాతలయిన రాజకీయ నాయకులను హెచ్చరిం చడానికి ఈ ప్రకటన చేయకతప్పడం లేదని శాస్త్రజు్ఞలు అంటున్నారు. ముందు ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయతి్నంచండి. ప్రగతి నిజంగా జరుగుతన్నదో లేదో పరిశీలించండి అని శాస్త్రవేత్తలు నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేట్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి. భూగర్భ ఇంధనాల బదులు సౌరశక్తి, వాయుశక్తికి మళ్లుతున్నారు. మనం వెంటనే చేయవలసిన పనులను కూడా శాస్త్రవేత్తలు సూచించారు. ఇంధనాన్ని చాలా అరుదైన సమ యాల్లోనే వాడడం అలవాటు చేసు కోవాలి. భూగర్భ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు వాటిమీద భారీ పన్నులు వేయాలి. అమ్మాయిలకు సుదీర్ఘకాలం చదువు చెప్పించడం మంచి వ్యూహమంటున్నారు. అడవుల నరికివేతను ఆపి, మడ అడవులు పెంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విలీనంచేసుకునే అవకాశాలు పెంచాలి. ఆకు కూరలు ఎక్కువగా తింటూ మాంసాహారాన్ని తగ్గించాలి.
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com
మాడభూషి శ్రీధర్‌ 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బలవంతుల గుప్పెట్లో నిఘా వ్యవస్థలు

సార్వత్రిక ఓటుహక్కు ప్రదాత అంబేడ్కర్‌

మీడియాలో పాక్షికత వాంఛనీయమా?

రిజర్వేషన్ల అమలులో అవకతవకలు

అమ్మఒడి ఒక మార్గదర్శిని

మెజారిటీ నైతికతకు సర్వజనామోదమా?

చరిత్ర వక్రీకరణకు మథనం?!

రాయని డైరీ: అమిత్‌ షా (బీజేపీ అధ్యక్షుడు)

దిగుమతులతో కుదేలవుతున్న వ్యవసాయం

శిల్పం – సారం

ఫిడేల్‌ నాయుడు గారు

ఈ దూకుడే వర్తమాన వాస్తవమా?

ఆర్టీఐ కోరలు పీకిన కేంద్రం

గోడలు మొలిచి.. గొడవలు పెరిగి!

శరదశ్శతమ్‌

అయోధ్యలో శాంతి కుసుమించేనా?

జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో

సమృద్ధి వెలుగులో ఆకలి నీడలు

జర్నలిస్టులలో దీపధారి–రాఘవాచారి

అమెరికా అగ్రవాదమే ఈ ఉగ్రవాదం!

పత్తి రైతులకు పొంచి ఉన్న విపత్తు

ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన)-రాయని డైరీ

‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’

కళ్యాణలోవని కాపాడుకుందాం

ఏమాటకామాట చెప్పుకోవాలి

ఆ రెండుచోట్లా ఎదురుగాలి!

ఆ అమరవీరుడికి న్యాయం దక్కదా?

ఆరిపోయే దీపానికి వెలుతురు అధికం

అది స్వర్ణయుగమేనా?!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు ఊళ్ల గొడవ

అమలా పూల్‌

హారర్‌ బ్రదర్స్‌ బయోపిక్‌

కమల్ @ 65

ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా? అనుకున్నా

హిట్టు కప్పు పట్టు