ఎమ్మెల్యే గారికి ఏ రోగం వచ్చింది? 

8 Jun, 2018 02:02 IST|Sakshi

విశ్లేషణ

ఎమ్మెల్యే గారికి ఏదైనా రోగం వస్తే దాని గురించి  సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద తెలుసు కోవచ్చా? పది రూపాయల ఫీజుతో ఏదైనా అడగ వచ్చనే ధోరణి మనకు కనిపిస్తోంది. ప్రజలతో సంబంధం లేని, ప్రజాప్రయోజనం లేని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రొత్సహించడం మంచిది కాదు. ఒక్కోసారి ఎమ్మెల్యే చికిత్సకు విపరీతంగా ప్రజాధనం ఖర్చుచేసినప్పుడు అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో సురూప్‌ సింగ్‌ హ్రియా నాయక్‌ అనే ఎమ్మెల్యే కోర్టు ధిక్కార నేరం చేశారని సుప్రీంకోర్టు నెల రోజుల శిక్ష విధించింది.

ఆయనను జైలుకు తీసుకుపోయిన ఒకటి రెండు రోజులకే ఛాతీ పట్టుకుని నొప్పి అనగానే అధికార పక్ష ఎమ్మెల్యే కనుక ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. 27 రోజులు చికిత్స చేశాక జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యేకు చేసిన చికిత్స ఆయన వ్యక్తిగత సమాచారం కాదు. ఆయ నకు అనారోగ్యం నిజమేనా? జైలు శిక్ష తప్పించు కుని, సకల సౌకర్యాలున్న ఆస్పత్రిలో గడపడానికి ఇలా నాటకమాడారా? అనే విషయం తెలుసుకోవల సిన అవసరం ఉంది. ప్రజాసేవకుడి గురించి సమా చారం దాచడానికి వీల్లేదన్నది నియమం. ఆయన వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదనేది దానికి మినహా యింపు. ఆ మినహాయింపునకు కూడా ఒక మినహా యింపు ఉంది, అదేమంటే ప్రజాప్రయోజనం ఉంద నుకుంటే ఆ సమాచారం కూడా ఇవ్వవలసిందే. 

భారత వైద్య మండలి చట్టం 1976 కింద ప్రొఫె షనల్‌ కాండక్ట్‌ (ఎటికెట్‌ అండ్‌ ఎథిక్స్‌) రెగ్యులేషన్‌ 2002 ప్రకారం వైద్య దస్తావేజులు, రోగి వైద్య పత్రాలు ఇతరులనుంచి గోపనీ యంగా ఉంచాలి. అవి అందరికీ ఇవ్వా ల్సిన వివరాలు కావు. కాని సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్‌ 8(1)(జే) ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రజాప్రయోజనం కోసం ఇవ్వవచ్చు. ఈ రెండు నియమాల మధ్య వైరుధ్యం ఏర్ప డినప్పుడు ఏ నియమాన్ని అనుసరిం చాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది. సూరూప్‌ సింగ్‌ హ్రియా నాయక్‌  కేసులో సమాచార హక్కు చట్టం కింద ఆయన రోగ వివరాల గురించి అడిగితే అది ఆయన వ్యక్తి గత సమాచారం అవుతుంది కనుక ఇచ్చేది లేదని ఆస్పత్రి వర్గాలు తిరస్కరించాయి.

కేసు హైకోర్టుకు చేరింది. నాయక్‌ వైద్య చికిత్స, జబ్బు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జైలు శిక్ష తప్పించుకోవడానికే రోగం వచ్చినట్టు నటిస్తే అది న్యాయవ్యవస్థను మోసం చేసినట్టవుతుంది.  ఛాతీ నొప్పికి 27 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయవ లసిన అవసరం రాదు. ఒకవేళ రోగం నకిలీ అనీ, చికిత్స పేరుతో జైలు శిక్ష తప్పించుకునే మోసమని తేలితే అది శిక్షార్హమైన నేరం అవుతుంది. కనుక ప్రజా ప్రయోజనం దృష్ట్యా సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. బాంబే హైకోర్టు మరో అంశాన్ని కూడా పరిశీలిం చింది. పార్లమెంటు, శాసనసభలకు నిరాకరించని సమాచారాన్ని ప్రజలకు నిరాకరించడానికి  వీల్లేదని సెక్షన్‌ 8(1) కింద మినహాయింపు చేర్చారు. ఒకవేళ ఎమ్మెల్యే జబ్బు గురించి శాసనసభలో ఎవరైనా అడి గితే ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పకత ప్పదు. పౌరుడు సమాచారహక్కు చట్టం కింద అడిగితే కూడా ఇవ్వక తప్పదు. 

సమాచార హక్కు చట్టంతో వైద్య మండలి నియమాలు విభేదిస్తే, సమాచార హక్కు చట్టం నియమాలనే అనుసరిం చాల్సి వస్తుందని సమాచార చట్టంలో సెక్షన్‌ 22 స్పష్టంగా వివరిస్తోంది. కనుక సురూప్‌ సింగ్‌ హ్రియా నాయక్‌ జబ్బు, చికిత్స సమాచారం చెప్పవలసిందేనని బోంబే హైకోర్టు వివరించింది. ఈ విషయంలో ఏఐఆర్‌ 2007 బాంబే 121లో ప్రచురితమైన తీర్పు వెల్లడి నియమాలను నిర్దేశించింది. నిషాప్రియా భాటియా వర్సెస్‌ మానవ ప్రవర్తనా పరిశోధనా సంస్థ కేసులో ఒక మహిళ తనకు ఆస్పత్రిలో చేసిన చికిత్స వివ రాలు అడిగింది. దానికి ఆ ఆస్పత్రి అధికారులు తాము ఆమె భర్తపై నమ్మకంతో సమాచారం ఇచ్చా మని, దాన్ని వెల్లడించలేమని ఆ మహిళకు జవాబి చ్చారు.

తప్పకుండా ఆ సమాచారాన్ని వెల్లడిం చాల్సిందేనని సమాచార కమిషనర్‌ 2014 జూలై24న  ([CIC/AD/A/2013/001681­SA) తీర్పు చెప్పారు. ఒక వ్యక్తికి చేసిన చికిత్స వివరాలు వాణిజ్య గోపనీయత కిందికి ఎలా వస్తాయో అధికారులు వివరించలేకపోయారు. ఇది ఒక అన్యాయాన్ని, నేర స్వభావాన్ని రక్షించడానికి సమాచారం నిరాకరించే దుర్మార్గం తప్ప మరొకటి కాదు.

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌,
కేంద్ర సమాచార కమిషనర్‌,
professorsridhar@gmail.com
 

మరిన్ని వార్తలు