కర్షకుడికి మేలు జరిగితే కన్నెర్ర

6 Apr, 2018 00:43 IST|Sakshi

విశ్లేషణ

అదే రైతులకు లాభసాటి ధరలను అమలు చేయడం గురించి మాట్లా డితే మరుక్షణం ఆర్థికవేత్తల కనుబొమలు ముడిపడతాయి. కనీస మద్దతు ధర నుంచి కేవలం కొద్దిమంది రైతులే లబ్ధి పొందుతారు. అయితే కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేస్తే ఏటా రూ. 45,000 కోట్లు అదనపు వ్యయం అవుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏడో వేతన సంఘం కోసం 4.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ఎవరూ అడగడం లేదు.

దాదాపు పదేళ్ల నుంచి రైతుల నిజ ఆదాయం (కొనుగోలు శక్తిని ద్రవ్యో ల్బణం ప్రభావితం చేసినప్పుడు నిర్ణయించేది) స్తంభించిపోయింది. ఇది అధికారిక సమాచారమే. ఔను! మీరు సరిగానే విన్నారు, రైతు నిజ ఆదాయం స్తంభించింది. ఒక సేద్యగాడి నిజ ఆదాయంలో ఐదేళ్ల నుంచి, అంటే 2015– 16 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా 0.44 శాతం పెరుగుదల మాత్రమే కని పించింది. మరోమాటలో చెప్పాలంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం ఎదుగూబొదుగూ లేకుండా స్తబ్దంగా ఉంది. 

రైతులకు మిగిలేది చేదు ఫలమే
ఈ పరిణామానికి తోడు 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా పరిణమించింది. అంతే కాకుండా తమ పంటను తెగనమ్ముకోవలసిన పరిస్థితులు, ఒత్తిడి తలెత్త డంతో ధరలు దారుణంగా పడిపోయాయి. దీనితో చాలామంది రైతులు తాము పండించిన పంటను రోడ్ల మీద పడేసి పోవడం దేశమంతటా కని పించింది. ఇలాంటి దెబ్బ టొమేటో, బంగాళదుంప, ఉల్లి పంటలకు గట్టిగా తగిలింది. ఈ ప్రభావం నుంచి ఇంకా వ్యవసాయ రంగం బయటపడలేదు. ఇందుకు మహారాష్ట్ర రైతులే మంచి ఉదాహరణ.

ఇటీవల ఆగ్రోవాన్‌ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం వ్యవసాయోత్పత్తు లను ప్రతిసారీ తక్కువ ధరకే అమ్ముకోవడం వల్ల ఆ రాష్ట్ర రైతులు ఒక్క తృణధాన్యాలలోనే రూ. 2,579 కోట్లు నష్టపోయారు. ఈ ఒక్క సీజన్‌లోనే చమురు గింజలను తెగనమ్ము కోవడం వల్ల రూ. 769 కోట్లు నష్టం వాటి ల్లింది. మిగిలిన ప్రాంతాలలో కూడా ఇదే పునరావృతమవుతూ ఉంటుంది. స్వరాజ్‌ అభియాన్‌ కూడా ఇలాంటి నష్టాలు ఏ రీతిలో ఉన్నాయో వెల్ల డిం చింది. బార్లీ పండించే రైతులు ఆ విధంగా రూ. 325 కోట్లు నష్ట పోతున్నారు. సేకరణ ధర క్వింటాల్‌కు రూ. 4,410 ఉండగా పద్ధతి ప్రకారం చెల్లించవలసిన ధర కంటే 15 శాతం తక్కువే ఉంటున్నది. ఉదాహరణకు శనగపప్పు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలో దీని ధర నాటకీ యంగా పడి పోయింది.

గత సంవత్సరం దక్కిన ధరతో పోల్చుకుంటే శనగపప్పు మార్కెట్‌ ధర 30 నుంచి 38 శాతం పతనమైంది. ఆవాల మొత్తం దిగుబడిని మార్కెట్లకు తరలించడం పట్ల రైతులు నిరసన ప్రకటించారు. ఈనామ్‌ మార్కెట్ల పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఈనామ్‌ మార్కెట్ల విషయంలో జరిగిన పటాటోపాన్ని పక్కన పెడితే, ప్రతిపాదిత 585 ఈనామ్‌ మార్కెట్లు ఏవీ కూడా వ్యవసాయోత్పత్తులను కనీస మద్దతు ధరకు కొను గోలు చేసే స్థితిలో లేవు. ఈనామ్‌ మార్కెట్లలో పద్ధతి ప్రకారం చెల్లిం చవలసిన ధరలను చెల్లించాలనే ప్రతిపాదించారు. ఈ ధరలను రోజువారీ వాణిజ్యంలో సగటు ద్వారా నిర్ణయిస్తారు. అయితే ఆ ధరలు కూడా న్యాయ బద్ధంగా లేవని తేలింది. ఇదంతా రైతులకు చేదు ఫలమే. 

రైతులలో పెల్లుబుకుతున్న ఆగ్రహం
భయానకమైన ఈ వ్యావసాయిక సంక్షోభమే రైతులను ఆగ్రహంతో రోడ్డు ఎక్కేటట్టు చేస్తున్నది. గడచిన సంవత్సర కాలంగా రైతుల ఆగ్రహావేశాలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. 2014–2016 – కేవలం ఈ రెండు సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే రైతుల నిరసన కార్యక్రమాలు అనూహ్యంగా పెరిగి పోయిన సంగతి అర్థమవుతుంది. దేశం మొత్తం మీద ఆ రెండేళ్లలోనే రైతు నిరసన కార్యక్రమాలు 680 శాతం పెరిగాయి. 2016 సంవత్సరంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నమోదు చేసిన నిరసనల సంఖ్య 4,837. అంటే ఇంచు మించు రోజుకు 14 నిరసనలు. అప్పటి నుంచి రైతుల నిరసన ప్రదర్శనలు కొన్ని రెట్లు పెరిగిపోయాయి. నా అభిప్రాయం ఒక్కటే. ఎన్నికల ఫలితాల మీద రైతాంగ సంక్షోభం తన ప్రభావాన్ని చూపించగలిగితే తప్ప రాజకీయ నాయకత్వానికి ఆర్థిక, సామాజిక పతనంలోని తీవ్రత గురించి తలకెక్కదు. ఆర్థిక వృద్ధిని సాధించడానికి వ్యవసాయాన్ని త్యాగం చేయాలని చాలామంది ఆర్థికవేత్తల ప్రబల ఆలోచన.

కాబట్టి సంస్కరణలకు అనుకూలమైన వాతా వరణం నెలకొనడం కోసం వ్యవసాయాన్ని మరింత లేమి వైపు నెట్టుతు న్నారు. రిజర్వుబ్యాంక్‌ మాజీ గవర్నర్‌ ఒక మాట పదే పదే చెబుతూ ఉంటారు. అదేమిటంటే, చౌకగా కూలీల అవసరం ఉన్న పట్టణాలకు వ్యవ సాయ రంగం నుంచి గణనీయమైన సంఖ్యలో జనాభా తరలిపోవాలి. అదే నిజమైన సంస్కరణ అంటారాయన. 1996లో ప్రపంచ బ్యాంక్‌ ఆదేశించినది కూడా ఇదే. రాబోయే (అప్పటికి) ఇరవై ఏళ్లలో, అంటే 2015 నాటికి గ్రామీణ ప్రాంతాల నుంచి నలభై కోట్ల మంది తరలిపోవాలని ప్రపంచ బ్యాంక్‌ ఆకాం క్షించింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ఆర్థిక విధానాన్ని అనుసరిం చాయి. కుడి లేదా ఎడమ లేదా మధ్యేమార్గం అనుసరించే ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు. విధానం మాత్రం అదే. ప్రభుత్వ రంగ సంస్థలలో మదుపు కోసం వ్యవసాయ రంగాన్ని పస్తులు ఉంచడమే. అలాగే సేద్యాన్ని లాభసాటి వ్యవహారం కాదంటూ, అందుకు పరిష్కారం వ్యవసాయ రంగం నుంచి జనా భాను బయటకు నెట్టడమేనని భావించారు. 

తనను తాను పునరావిష్కరించుకోవాలి
ఇలాంటి నిరాశాపూరిత వాతావరణంలో వ్యవసాయం తనను తాను పునరా విష్కరించుకోవలసిన అవసరం ఉంది. వ్యవసాయాభివృద్ధికి మామూలు మోతాదులో ఇచ్చే ప్రోత్సాహం చాలదు. వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవా లని నిజంగా భావిస్తే అసలు ఆర్థికరంగంలో మౌలిక మార్పు తేవడం ద్వారానే సాధ్యమన్న సంగతిని గుర్తించాలి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచు కుంటూనే, గడచిన కొన్నేళ్లుగా పట్టణాలలో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్న సంగతిని కూడా గమనించాలి. కాబట్టి మిగిలివున్న ఏకైక ప్రత్యా మ్నాయం వ్యవసాయ రంగం తనని తాను పునరావిష్కరించుకోవడమే. దీని గురించి కొంచెం వివరిస్తాను. 2004–14 నుంచి చూస్తే స్థూల జాతీయోత్పత్తి రేటు ఎక్కువగానే ఉన్నా, అది సంవత్సరానికి 1.25 కోట్ల ఉద్యోగాలను సృష్టించ గలిగినది కాదు. కేవలం కొలది ఉద్యోగాలను మాత్రమే సృష్టించడం జరిగింది.

మరొకమాటలో చెప్పాలంటే 17.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడం జరుగుతుందని అంచనా వేశారు. కానీ సృష్టించినవి మాత్రం 1.6 కోట్ల ఉద్యో గాలే. కాబట్టి వ్యవసాయం నుంచి జనాభాను తరలించాలన్న ఆలోచన ఆర్థిక శాస్త్ర పరమైన స్పృహతో చేసినది కాలేదు. ఉద్యోగావకాశాల మార్కెట్‌ ఒట్టి పోయింది. అందుచేత వ్యవసాయాన్ని ఆర్థికంగా సానుకూలమైనది, పర్యావ రణపరంగా నిలకడైనదని మన ఇంగితజ్ఞానం గ్రహించాలి. 52 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అంటే దాదాపు 60 కోట్ల జనాభా. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో లాభదాయకమైన ఆదాయ మార్గాలు చూపించాలి. పట్టణాలలో, నగరాలలో ఉన్న కార్మికులను వ్యవసాయ రంగాన్ని పునర్నిర్మించేందుకు గ్రామాలకు తరలేటట్టు చేసే విధంగా ఆర్థిక నిపుణుల ఆలోచనా ధోరణి మారినప్పుడే అది సాధ్యమవుతుంది. 

రైతుకు మేలు చేస్తే కన్నెర్ర
దేశంలో పేదలకు ఉన్న ఏకైక ఆర్థిక భద్రత భూమి. పేదల దగ్గర ఉండే కొద్దిపాటి భూమిని లాక్కోవాలని అనుకోవడం సరైన ఆర్థికశాస్త్ర చింతన కాలేదు. కానీ భూమిని లాక్కోవడమే ఇప్పుడు ప్రపంచమంతటా ఒక ధోర ణిగా మారిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో రైతులు భూమిలేని నిరుపేద శ్రామికులుగా మారిపోయారు. వీరికి కొద్దిపాటి భూమి ఇస్తే కనుక, ఆ చర్య ఆర్థిక పతనానికి దారి తీస్తుంది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని తర్కం ఒకటి ఉంది. వ్యాపార వర్గాలకు మాత్రం చదరపు మీటరు ఒక రూపాయి నామమాత్రపు ధరకు ధారాదత్తం చేయడమేమిటో అర్థం కాదు. అలా వ్యాపార వర్గాలకు కట్టబెడుతున్న భూఖండాలను లక్షలాదిగా ఉన్న భూమిలేని నిరుపేదలకు చదరపు మీటరు రూపాయికి ఇస్తే గ్రామీణ ఆర్థిక దృశ్యం గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది. ఇదే వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించడంలో తొలి అడుగు అవుతుంది. దీనికి కనీసంగా జీవించడానికి అవకాశం కల్పించే నెలవారీ వ్యవసాయ ఆదాయ విధానం కూడా తోడుగా ఉండాలి.  

అసమ ఆర్థిక విధానం
ఇది ప్రాథమ్యాలకు సంబంధించిన ప్రశ్న. ఏడో వేతన సంఘం సిఫారసుల వల్ల 45 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 50 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరగలదని అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఏటా ప్రభుత్వానికి రూ. 1.02 లక్షల కోట్లు భారం పడుతుందని ఆర్థికమంత్రి తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కళాశాలలు దేశ వ్యాప్తంగా ఆ సిఫా రసులను అమలు చేస్తే అదనపు భారం రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని క్రెడిట్‌ సుయిస్సే బ్యాంక్‌ చెబుతుంది. ఇదంతా దేశంలో ఒకటి నుంచి రెండు శాతం ఉన్న ఉద్యోగవర్గాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. చిత్రం ఏమి టంటే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందని ఏ ఆర్థికవేత్త ఎప్పుడూ ప్రశ్నించడు. లేదా పెరుగుతున్న ఆర్థికలోటు గురించి కూడా ఎవరూ నిలదీ యరు. కానీ పారిశ్రామికరంగం మాత్రం దీనిని ప్రోత్సాహక మోతాదుగా పేర్కొంటుంది. ఎందుకంటే జనం చేతిలో అదనపు ధనం ఉంటే వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుంది.

అదే రైతులకు లాభసాటి ధరలను అమలు చేయడం గురించి మాట్లా డితే మరుక్షణం ఆర్థికవేత్తల కనుబొమలు ముడిపడతాయి. కనీస మద్దతు ధర నుంచి కేవలం కొద్దిమంది రైతులే లబ్ధి పొందుతారు. అయితే కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేస్తే ఏటా రూ. 45,000 కోట్లు అదనపు వ్యయం అవుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏడో వేతన సంఘం కోసం 4.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం ఎవరూ అడగడం లేదు. మన ఆర్థిక విధానం ఇలా అన్యాయంగా, అసమ దృష్టితో రూపొం దింది. 
నిజానికి గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్‌ను పెంచితే ఆర్థిక వ్యవస్థకు అది వేగవంతమైన మోతాదు అందించినట్టవుతుంది. ఇది మంచి రాజ కీయమే కాదు, మంచి ఆర్థికశాస్త్రం కూడా.


దేవిందర్‌శర్మ, వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు