ఇన్‌బాక్స్‌ : ఆ నడిపించు వాడు

1 Oct, 2019 00:41 IST|Sakshi

ఆ నడిపించు వాడెవడు? ఖ్యాతి 
గడింతురె జీర్ణ దేహులున్‌? 
‘‘వానికి గోచి గుడ్డయును, వాని 
కరమ్ముల నూత కఱ<యున్‌ 
వాని కనీనికా సుధము, పాపల 
వోలిక బోసి నవ్వులున్‌ 
వానిని చూడు! పోచవలె, వాడు 
మహీధర మేరు ధీరుడున్‌!’’ 
 
ఆ నినదించు కోటి జనులు, ఆ గొని 
పోయెడు గమ్యమెచ్చటో? 
‘‘దీనుల స్వేచ్ఛగోరి నినదించు 
గంభీర సముద్ర తీరముల్‌! 
కానని ఉచ్ఛనీచములు, కన్నులు 
గానని దండనీతియున్, 
పూని మహా సముద్రమటు పొంగెడు 
నేలకు జైళ్లు చాలునే?’’ 
 
‘‘ఆ నడిపించు వాడు, వెనుకంజను 
వేయని ముక్త కంఠముల్‌ 
ప్రాణముపైన ప్రీతి, ఉరిత్రాతను 
భీతియు, లేని జాతియున్‌ 
బానిస సంకెలల్‌ విడి, త్రివర్ణ 
పతాకము నెత్తు రోజునన్‌ 
మౌనవ్రతమ్ము వానికి, క్షమం 
ధరణిన్‌ విభజించు బాధచే!’’ 
 
ఆ నడిపించు వానిని, మహాత్ముడ 
టంచు నుతింతురేటికిన్‌? 
‘‘వాని అహింస, సత్యమును, వాని 
ధరాతల శాంతి మంత్రమున్‌ 
వాని అఖండ త్యాగమును, 
వజ్రము వంటి కఠోర దీక్షయున్‌ 
వానికభాగ్య మానవులపై గల 
జాలి, దయాంతరంగమున్‌!’’ 
 
ఆ నడిపించు తండ్రి నకటా! బలి 
దానము కోరె దేశమున్‌? 
‘‘కానలె మానవోత్తముడొకందు 
బుజంబున శిల్వ దాల్చుటన్‌? 
పూనడె కాలకూటమును మోదముతో 
నొక తత్వవేత్తయున్‌? 
మానిత ధీర మానవుల మార్గమిదే, 
బలిపీఠమెక్కుటన్‌!’’ 
 
‘‘వాని విశిష్ట దేహమిట వ్రాలె 
జపించుచు రామనామమున్‌ 
వానిని గొన్న నేల తలవాల్పవొ 
భక్తిని చిట్టి తమ్ముడా! 
వాని పవిత్ర ధూళి గొని, ఫాలము 
దిద్దవె ముద్దు చెల్లెలా! 
మీ నయనాల ముత్తెములు, మీ పసి 
బుగ్గల మౌన బాష్పముల్‌?’’  
– నివర్తి మోహన్‌ కుమార్‌ 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీవన పర్యంతం రాజీలేని పోరాటం

జీవితమే ఒక వ్యూహం, ఓ ప్రయోగం

శరద్‌ పవార్‌ (ఎన్‌సీపి).. రాయని డైరీ

పెద్దలకు రాయితీ–పేదలకు కోత

ముగ్గురమ్మల ముచ్చట

జీవితం వడగాడ్పు, కవిత్వం వెన్నెల

సాంకేతిక రహస్యం తెలిసిన శాస్త్రవేత్త

మనం ఇంకా గెలువని కశ్మీర్‌

చంద్రబాబుతో చెలిమి అనర్థదాయకం

కోడెలను బలిపీఠం ఎక్కించిందెవరు?

తెలుగువారి ఘనకీర్తి

ప్రాణదాత ఎవరు.. ప్రాణహర్త ఎవరు?

పరుగులెత్తనున్న ప్రగతి రథం

కోడెలను కాటేసిందెవరు?

హిందీ ఆధిపత్యం ప్రమాదకరం

రైతు సమస్యల పరిష్కారంతోటే జాతి భద్రత

ఇంట్లో ‘ఈగలు’... బయట పల్లకీలు!

రాయని డైరీ.. నరేంద్ర మోదీ (భారత ప్రధాని)

భారత తీరానికి యూరప్‌ హారం

తసమదీయ మాయాబజార్‌!

కేంద్ర బడ్జెట్‌ నిండా హంసపాదులే

ఈ ఆర్థికంలో అద్భుతాలు సాధ్యమా?

గతం వలలో చిక్కుకోవద్దు

ఒంటికి సెగ తగిలినా కదలరా?

ఫరూఖ్‌ నిర్బంధం తీవ్ర తప్పిదం

దక్షిణాది భాషలపై హిందీ పెత్తనం

ఆర్థిక సంక్షోభానికి ముసుగేల?

‘తుఫాను’ ముందు ప్రశాంతత

పల్నాడులో బాబు ఫ్యాక్షనిజం

తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!

‘ఆవిరి’పై సూపర్‌స్టార్‌ కామెంట్స్‌

విజయ్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌!

‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

బిగ్‌బాస్‌.. టాస్క్‌లో మహేష్‌  ఫైర్‌

తుఫాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల..