భాషకు ప్రాంతీయ హద్దులెందుకు?

23 Dec, 2017 01:14 IST|Sakshi

గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు! నమస్కారం!


భాష పుట్టుక, నది జన్మ ఎవ్వరికీ తెలియదు. మనస్సులోని భావాలను ఇతరులతో పంచుకునే గొప్ప సాధనమే భాష. భాష నది వంటిది రాష్ట్రాలుగా మనల్ని కలుపుతుంది. సముద్రం పర భాష వంటిది దేశాలుగా విభజిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే తనలో ఉండే అహాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, మనస్సుని సమన్వయం చేసుకోవాలి. సమన్వయము చేసుకునే జ్ఞాపక శక్తి ప్రవహించే నది తియ్యని జలాలతో మనకి ఇస్తుంది. ఆ నది పేరే సరస్వతి. సరస్వతీ నదికి సమ న్వయము చేసే శక్తి ఉంటుంది అక్కడ నుంచి వచ్చినదే అతి పురాతనమైన తెలుగు భాష.

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ నగ రంలో జరగడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. సమ్మే ళనం తెలుగు పేరు మీద జరిగింది. తెలుగు అంటే తెలం గాణ ప్రాంతం వారిదే కాదు. తెలుగు మాట్లాడే, మాట్లా డిన వారి సొంతం ఈ సమ్మేళనం. సమ్మేళనానికి వేల సంఖ్యలో అతిథులు విచ్చేసారు. పండితులైన శ్రీనాథ, అన్నమాచార్య, విశ్వనాథ సత్యనారాయణ, రాయ ప్రోలు, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర వంటి వారి ప్రస్తావన చేసి ఉంటే సభకు మరింత వన్నెను ఇచ్చేది. తెలుగు వారిగా ఆధునిక కవులను గౌరవించాలి. సాహి త్యానికి హద్దులు లేవని చాటాలి. గౌరవనీయ రాష్ట్రపతి గారు తమ ప్రసంగంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అని గుర్తు చేశారు. తెలుగు భాషకు ప్రతినిధిగా విదేశాలలో ఉన్న తెలుగు వారిని ఆహ్వానించినట్లే ఆంధ్రా ప్రజలను కూడా ఆహ్వానించి ఉండాల్సింది.

రాజకీయ ఇతర కారణాలను పక్కనపెట్టి చంద్ర బాబు నాయుడుగారిని కూడా సభలలో ఉండేలా చేసి ఉంటే తెలుగువారు ఒక్కటే అనే సందేశం అందరికీ అంది ఉండేది. అందమైన లేజర్‌ షోలో రచయితల చిత్రాలతో వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమం నిండుతనాన్ని ఇచ్చేది. బతుకమ్మ మన రచయితలను మించినది అని చెప్పడం మనల్ని మనం మోసం చేసు కోవడమే. హైదరాబాద్‌ నగరం తన సంస్కృతితో పాటు లక్షల కుటుంబాలను కాపాడుతూ వచ్చింది. వందల సంవత్సరాలుగా మేము అందరము ఇక్కడ నివసి స్తున్నాము. ప్రఖ్యాత రచయిత మహాకవి గుంటూరు శేషేంద్ర గారి భార్యగా మాకు ఆహ్వానం అందలేదు. కానీ మా కోరిక మీముందు ఉంచడం బాధ్యతగా భావిస్తూ భవిష్యత్తులో జరిగే సభలలో ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ప్రతి ఒక్క తెలుగు రచయితను గుర్తు చేసుకోవాలి. రచయితలను, వారి కుటుంబాలను అవమానకర పరిస్థితులలో ఉంచ కూడదు.

మీరు తెలివైన వారు. ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. తెలుగు భాష రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక వారధి. భాష ఇరు రాష్ట్రాల ప్రజలను కలిసి ఉండేలా చెయ్యాలి. ఆంధ్రా వారు, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఉండటం కారణంగా మీమీద మరింత బాధ్యత ఉన్నది. మీరు తెలుగు ప్రజ లందరికీ ముఖ్య నేత అనే విషయాన్ని గమనించాలి. రాష్ట్రానికి హద్దు ఉంటుంది. భాషకు హద్దు ఉండదు. వివక్ష జరిగింది అని గుర్తు చేసుకుంటూ ఉంటే కక్ష పెరు గుతుంది. కక్షలు, వివక్షలు లేకుండా ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. అభిమానం, అభి లాష, ఉత్సుకత సాంద్రతతో తెలియనిది తెలుసుకో వాలి అని వచ్చే వారికి తెలిపే ప్రయత్నం చెయ్యాలి.

– ఇందిరా దేవి ధనరాజ్‌ గిరి,
గుంటూరు శేషేంద్రశర్మగారి సతీమణి
జియాన్‌ బాగ్‌ ప్యాలెస్‌
97015 02653

>
మరిన్ని వార్తలు