పంటసిరితో తెలంగాణ కళకళ

6 Feb, 2019 00:57 IST|Sakshi

అభిప్రాయం

ఒకప్పుడు దేశమంతటా కరువు తాండవించినా.. తెలంగాణలో మాత్రం కరువు ఛాయలు రాలేదు. 250 ఏళ్లుగా  ఇక్కడ తిండి గింజలకు ఇబ్బంది లేదు. కాకతీయులు తవ్వించిన చెరువులు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాయి. 1630–32లో, 1702–04లో దక్కన్‌ ప్రాంతంలో కరు వొచ్చి, దాదాపు 2మిలియన్ల మంది చనిపోయారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. దెబ్బతిన్న అప్పటి ముస్లిం పాలకులు చెరువుల మీద దృష్టి పెట్టారు. కొత్త చెరువులు తవ్వించారు. పాత చెరువులు పున రుద్ధరించారు. నాటినుంచిæ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే వరకు కరువు ప్రభావం లేదు.

హరిత విప్లవాని కంటే ముందే దేశ వాప్తంగా వరి దిగుబడి ప్రతి ఏడాది 1.3 శాతం చొప్పున పెరు గుతూ వస్తే. దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో దిగుబడి శాతం 2.2 శాతం ఉంది. 1967 తరువాత దేశంలో హరిత విప్లవం ఊపందుకుంది. 1990 నాటికి భార తదేశంలో వరి వార్షిక దిగుబడి 3.6 శాతానికి పెరి గింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఈ దిగుబడి 1.9 శాతానికి పడిపోయింది. కారణం..

రైతును ఆధునిక సేద్యం వైపుకు మళ్లించాల్సిన గత పాలకులు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని విస్మరించారు. చేసిన ప్రయోగాలన్ని గుంటూరు, గోదావరి జిల్లాలను బేస్‌గా చేసుకొని పరిశోధనలు జరిగాయి. ఆంధ్ర ప్రాంత సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని తట్టుకోగల వరి వంగడాలను రూపొందించటంపైనే పరిశోధనలు జరిగాయి. ఎంటీయు, ఆర్‌జీఎల్‌ ఎన్‌ఎల్‌ఆర్‌ వంటి ఆంధ్ర ప్రాంత వాతావరణాన్ని తట్టుకొని నిలవగలిగే వంగ డాలను తెలంగాణ ప్రాంత రైతాంగం మీదికి రుద్దడంతో తెలంగాణ ప్రాంతంలో అనుకున్నంత దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

నేడు తెలంగాణ దశాబ్దాల కష్టాలను అన్నిటినీ అధిగమించింది. ఇప్పుడు గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ మాగాణుల్లో పారుతున్నాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు శ్రమించి ‘తెలంగాణ సోనా’(ఆర్‌ఎన్‌ఆర్‌–15048), బతుకమ్మ వడ్లు  వంటి కొత్త వంగడాలు  ఆవిష్కరించారు. ఫలితంగా కరువులతో అల్లాడిన రైతులకు ఈ యాసం గిలో కరువు తీరా పంట పండింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 61 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 2015–16 యాసంగితో పోలిస్తే 2015–16 యాసంగిలో మూడు రెట్లు పెరిగింది. 2015–16 యాసంగిలో 7.21 లక్షల టన్నులు రాగా, 2016–71లో  ఏకంగా 26.41 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది. 2016–17లో 38.01 దిగుబడి లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఆ రికార్డును బద్దలు కొడుతూ 2018–19లో 61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.. గత రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా 2013–14 ఖరీఫ్‌లో 56.56 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది, అప్పటితో పోలిస్తే ఇప్పటి దిగుబడి ఏకంగా 4.44 లక్షల టన్నులు అదనం. మొత్తంగా 25.65 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఇది తెలంగాణ వ్యవసాయ పురోగతికి తొలి సంకేతం.


సోలిపేట రామలింగారెడ్డి 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు,
దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141

మరిన్ని వార్తలు