ప్రతి అడుగూ ప్రగతివైపే..

9 Mar, 2018 02:15 IST|Sakshi

అభిప్రాయం
అర్హులైన ప్రతి పేదవాడూ డబుల్‌ బెడ్‌రూం ఇంట్లో  పిల్లాపాపలతో సగౌరవంగా బతకాలనేది కేసీఆర్‌ ఆకాంక్ష. దశల వారీగా ప్రతి అర్హునికి సొంత ఇంటి కల నెర వేరేంత వరకు ఈ పథకం కొనసాగుతూనే ఉంటుందని అసెంబ్లీలో ప్రకటించారు.

దశాబ్దాల కాలం పాటు కొనసా గిన వివక్ష, అన్యాయంపై అవి శ్రాంత  పోరాటం చేసి సాధించు కున్న రాష్ట్రం మనది .  తెలంగా ణది ఒక ప్రత్యేకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ.  వైవిధ్యభరిత జీవన విధానం ఇక్కడి ప్రజలది. అనువంశికంగా అబ్బిన అద్భు తమైన నైపుణ్యాలను పొందిన సామాజిక వర్గాల సమాహారమే తెలంగాణ పల్లెలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయటం ద్వారానే తెలంగాణ అభివృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుంది. కోట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని కొత్త అధ్యాయాన్ని లిఖించాం. ప్రతి అడుగు ప్రగతి వైపే వేస్తూ  సరికొత్త చరి త్రకు రూపం పోయాలి. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే పాలకులకు, ప్రతిపక్షాలకు  కొలబద్దలు కావాలి.

పల్లెల మొండి గోడల మీద మొలిచిన చెట్లను పీకేసి, బీడు బడిన భూములను పొతం చేసుకునే  సమయం ఇది. గ్రామ జీవితం మీద అలుముకున్న విషణ్ణ వదనాన్ని తొల గించి సుందరమైన, సుసంపన్నమైన  ముఖ చిత్రాన్ని తీర్చి దిద్దుకోవాల్సిన తరుణం. తాత్విక ధోరణికి, తార్కిక ఆలో చనలకు పదును పెట్టి ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ భౌతిక స్వరూపం కోసం జనం మధ్యన నిలబడాల్సింది పోయి, అధికార పీఠమే పరమార్థంగా ప్రతిపక్షాలు, విమ ర్శించటమే పనిగా పెట్టుకున్న ఓ స్వయం ప్రకటిత  మేధావి వర్గం విమర్శలను వల్లిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోలేక వందలాది యువత, విద్యార్థుల బలిదానాలకు కారణమైన వీళ్లే ఇప్పుడు తాత్విక దారిద్య్రంతో తెలంగాణ అభివృద్ధిని పునాదుల్లోనే సమాధి చేయడానికి  ప్రయత్నం చేస్తున్నారు.

తాత్విక దృక్పథం తెలంగాణ సామాజిక వర్గాల్లో  సామాన్య ప్రజలకు  సహజంగానే అబ్బింది. జనం తార్కి కంగా ఆలోచిస్తూ, ఏది మంచో ఏది చెడో అర్థం గమ నిస్తున్నారు. కానీ ప్రతిపక్షానికి, కుహనా మేధావి వర్గానికి ఇది ఇంకా అబ్బినట్లు లేదు. తెలంగాణ బాగుకన్న వారికి అధికార పీఠం, వాళ్ల స్వంత‡ప్రయోజనాలే ముఖ్యం. ముందుగా అవి నెరవేరితే చాలు వారికి ఏ పట్టింపూ ఉండదు. అవి నెరవేరినపుడు, ప్రజలు బాగుపడుతు న్నారా? దళితులు ఆత్మగౌరవంతో బతుకుతున్నరా? లేదా? అనే దానితో పనే లేదు.  ఏ పని చేపట్టినా... అందు లోని చెడును మాత్రమే వెతికితీయటం, మంచిని కూడా చెడుగా చూపబూనటమే వారి ధోరణి అవుతుంది. గత మూడున్నరేండ్లుగా ప్రతి  పనిలోనూ ఇదే  ధోరణి.

నిరుపేదలు, దళిత బహుజనులు ఆత్మ గౌరవంతో బతకాలి. అర్హులైన ప్రతి పేదవానికీ డబుల్‌ బెడ్‌రూం  ఇంట్లో పిల్లాపాపలతో సగౌరవంగా బతకాలనేది  ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష. రూ 5.04 లక్షలు ఖర్చు చేసి రెండు పడక గదులు, హాలు, వంటగది రెండు మరుగు దొడ్లతో ఇళ్ల నిర్మాణం చేయాలనే నిర్ణయం ఒక తెగువ. సంక్షేమం అంటేనే ప్రజలను కూర్చోబెట్టి పోషించటం అనే భ్రమలతో ఉన్న భ్రమిత్‌షా, మోదీ లాంటి వాళ్లకు తలకిం దులుగా తపస్సు చేసినా ఈ తెగువ రాదు.  ఇప్పటి వరకు 2.60 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది దశల వారీగా ప్రతి అర్హునికి సొంత ఇంటి కల నెరవేరేంత వరకు కొనసాగుతూనే ఉంటుందని కేసీ ఆర్‌ అసెంబ్లీలోనే ప్రకటించి చట్టబద్ధత కల్పించారు.  

రాష్ట్రంలోనే అత్యధికంగా నా దుబ్బాక నియోజకవర్గా నికి 3,900 ఇళ్లు వచ్చాయి. ఇందులో 70 శాతం ఇళ్లు దళిత, గిరిజనులకే ఇచ్చాం. కొత్త మండలం రాయపోల్‌లో చిన్న జాగా సమస్య ఉత్పన్నం అయింది. 45 మంది దళిత కుటుంబాలకు గుడిసెల స్థానంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టివ్వాలనుకున్నాం... గుడిసెలు తీసిన తరువాత జాగా సరిపోలేదు. వెంటనే మరో స్థలం చూసి లే అవుట్‌ చేశాం. దీనికి 10 రోజుల సమయం పట్టింది. ఇంకేముంది... గోతి కాడినక్కలా ఎదురు చూస్తున్న బీజేపీ రాజకీయ దురుద్దేశం మది నిండా పెట్టుకుని.. దళితులకు అన్యాయం జరిగిపో యిందని ఆరోపించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యు లను తీసుకువచ్చింది.

దళితులపై  పోలీసు, అగ్రవర్ణాల ఆగడాలను సహించలేకనే.. గన్నును, ఆ తరువాత నా పెన్నును వాళ్లకు రక్షణ కవచంగా పెట్టిన వాణ్ణి.. గోసా న్‌పల్లిలో 25 దళిత కుటుంబాలను పోలీసులు గ్రామ బహిష్కరణ చేసినప్పుడు నా ప్రాణాలను అడ్డుపెట్టి ధర్మ పోరాటం చేసిన వాణ్ణి. ఈ కమిషన్‌ సభ్యున్ని ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతున్న. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండ లం అభంగ పట్నంలో బీజేపీ నాయకుడు భరత్‌రెడ్డి దళితు లను మురికి నీళ్లలో ముంచి దారుణంగా అవమానించిన ప్పుడు ఆ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోలేదు?  మీ ప్రభుత్వం ఉన్న రాజస్తాన్‌లో అగ్ర వర్ణ కామాంధులు ఈడొచ్చిన దళిత ఆడబిడ్డను బలవంతంగా ఎత్తుకపోయి మానభంగాలకు పాల్పడుతున్న వీడియోలు సోషల్‌ మీడి యాలో చక్కర్లు కొడుతున్నా మీరెందుకు స్పందించలేదు?

రాయపోల్‌ దళితులు గుడిసెల్లోనే ఉండాలనేది మీ ఉద్దేశ్యం అయితే చెప్పండి.. దాన్ని మా దళిత సోదరులు స్వాగతిస్తే మళ్లీ అదే జాగాలో గుడిసెలు వేసిస్తాం. ప్రతి రాజకీయ పార్టీకి తమ సొంత లక్ష్యాలు ఉంటాయి. వాటిని నేను తప్పు పట్టలేను, పట్టను. కానీ ఆ లక్ష్య నిర్దేశాలు  తెలంగాణ సమాజానికి చేస్తున్న మేలు ఎంత? అని ఒక్క సారి కాకుంటే ఒకసారైనా విజ్ఞులు బేరీజు వేసు కోవాల్సిన అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఆవిష్క రణ నూటికి నూరుపాళ్లు ప్రజల కోసం గాని మరెవరి కోసమూ కాదు. అందుకు సరిపోగల తాత్వికతను పార్టీలు గానీ, మేధావులుగానీ చూపాల్సి ఉంది. అటువంటి తాత్వి కతలో నిర్మాణాత్మకత ఉంటుంది. అలా కాకుండా కమిషన్‌ మా చేతిలో ఉంది. అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తా మంటే... టాడా కేసులకే  రామలింగారెడ్డి భయపడలేదు. ఒక్క విషయమైతే సుస్పష్టం. రాయపోల్‌లో నా దళిత సోదర కుటుంబాలను డబుల్‌బెడ్‌రూం ఇళ్లలోకి తోలిన తరువాతే జైలుకు వెళ్తా.

సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే
మొబైల్‌ : 9440380141

మరిన్ని వార్తలు