చెరిగిపోని ఉద్యమ స్ఫూర్తి జాదవ్‌

17 Jun, 2018 01:36 IST|Sakshi

నివాళి

తాను పుట్టి పెరిగిన  ప్రాంతంనుంచే  హైదరాబాద్‌  నగర స్వరూప స్వభావాలను అర్ధం చేసుకున్న కేశవరావు జాదవ్, ఆత్రాఫ్‌ బల్దా’ అనే హైదరాబాద్‌లో సంపన్నులూ, దానిచుట్టూ కులీనులకు పని చేసే సేవకులు అంటూ విశ్లేషించాడు. అందుకే  దీపం చుట్టూ  చీకటి లాగా నగరం చుట్టూ వెనుకబడ్డ ప్రాంతాలంటూ ఆత్రాఫ్‌ బల్దాకు సరైన  నిర్వచనమిచ్చాడు. రాచరికంలో గీతగీసినట్టే  రంగారెడ్డి జిల్లా హైదరాబాదు చుట్టూ  వలయంలో  ఏర్పడ్డది. ఈ ప్రాంతాలను  వెనుకబడేయడం ద్వారానే నగరాల్లోని పెట్టుబడికి, శ్రమను అమ్ముకునే చీప్‌ లేబర్‌ దొరుకుతుందన్నారు.

తెలుగుగడ్డ మీద తెలంగాణ ఖ్యాతిని చాటుతూ రాష్ట్ర సాధనోద్యమానికే కాకుండా గాకుండా, తెలంగాణ పోరాట కీర్తికి వన్నెలద్దిన వాళ్లలో ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ (86) ఒకరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘‘తన తండ్రి శంకరరావు జాదవ్‌ హైదరాబాదీ, తాను మిస్టర్‌ తెలంగాణ’’ అంటూ సగర్వంగా చాటిన పలుకులు పవిత్ర రంజాన్‌ నాడే శాశ్వతంగా మూగబోయాయి. 1933 జనవరి 27న శంకరరావు – అమృతరావు దంపతులకు జన్మించిన జాదవ్‌ ఇక లేడనే వార్త ఎంతో బాధ కల్గిస్తుంది. హక్కుల ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం వరకు మూడు దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాల రీత్యా ఈ ఏడాది సార్‌కు జన్మదిన శుభా కాంక్షలు చెప్పలేకపోయాను.

కానీ ఇదే అతని చివరి జన్మదిన అవుతుందని ఊహించ లేదు. అనారోగ్యంతో  ఆసుపత్రిలో చేరిన  విషయం తెల్సిన కుటుంబ సభ్యుల జాగ్రత్తల మూలంగా బిస్టిన్‌కోన్‌ (బర్కత్‌పురా) ఆసుపత్రి సార్‌ చివరి మజిలీ అయిపోయింది.  చివరిసారిగా అక్కడైనా సార్‌ను సజీవంగా చూడలేకపోయినందుకు చింతిస్తున్నాను. జంపాల  చంద్రశేఖర్‌ ప్రసాద్, మదుసూదన్‌ రాజ్‌ యాదవ్, సిరిల్‌రెడ్డి, కూర రాజన్న,  గద్దర్‌ లాంటి  ఎంతో మందికి ఉస్మానియా ఇంజనీరింగ్‌ కాలేజిలో ఆంగ్లం బోధించిన సార్‌  వేలాదిమంది యువతను ప్రభావితం చేశారు.

2004లో రాష్ట్ర ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో పాల్గోన్న మధ్యవర్తుల కమిటీలో ఈయన సభ్యుడు 2009 జులైలో నేను చర్లపల్లి  కేంద్ర  కారాగారం నుంచి విదుదలై, ఖైదీల మధ్య సమస్యలపై నాటి ముఖ్యమంత్రి  వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిని  కలువడానికి  వెళ్ళినప్పుడు  చుక్కారామయ్యతో పాటు నా వెంట వచ్చారు. గాంధీ  హాస్పిటల్‌ లోని  50 పడకల జైలు  వార్డును ఫంక్షన్‌ చేయించడంలో సహకరించాడు. అందుకే 2016  జనవరి 27న మిస్టర్‌ తెలంగాణ అంటూ సార్‌ గురించి  రాసిన  వ్యాసపు శీర్షికతోనే ఆయన్ని అంతిమంగా  స్మరించుకోవాల్సి  వస్తోంది.  కానీ మిస్టర్‌  తెలంగాణలో విశ్రాంత ఆచార్యులు, ఉద్యమ  నాయకులైన  కేశవరావ్‌ జాదవ్‌ పేరు ఎన్నటికి  మాసిపోదు. వారి ఉద్యమ స్ఫూర్తి  పోరాట  Mీ ర్తి  భావిత  తరాలను మేలుకొల్పుతూనే ఉంటుంది. 

కులీన వర్గాలకు ఆలవాలమైన హైదరాబాద్‌ పాతబస్తీలో హుస్సేని ఆలంలో జాదవ్‌ సార్‌ జన్మించారు. అందుకే ఆయన సంపన్నుల ఆ డంబరాలను, వారికి సేవ చేసే సామాన్యుల అగ చాట్లను ఏకకాలంలో చూడగలిగారు. వ్యవహారి కంలో, పరిపాలనలో ఉర్దూను  ఒంటబట్టించుకున్న  తండ్రి ఇంగ్లీష్‌ను  ప్రత్యేకంగా బోధించారు. ఈ భాషా పరిజ్ఞానం అతన్ని మార్క్సిస్టుగా తీర్చిదిద్దితే, రామ్‌ మనోహర్‌ లోహియా ప్రభావం అతడిని సోషలిస్టుగా మార్చింది. 1946 నుంచి 1951 నవంబర్‌  వరకు సాగిన చారిత్రక  తెలంగాణ సాయుధ  రైతాంగ  పోరాటంతో ప్రభావం చెందిన  బాలుడిగా  కేశవరావు జాదవ్‌ ఉద్యమ జీవితం  ప్రారంభమైంది. ఈ చైతన్యపూరిత  కార్యక్రమాలను నిలువరించ డానికి  రజాకార్లు తనను చితగ్గొట్టి  గటార్లో (మురికికాల్వలో) పడేశారని సార్‌ చెప్పుకొచ్చాడు.

తాను పుట్టి పెరిగిన  ప్రాంతంనుంచే  హైదరాబాద్‌  నగర స్వరూప స్వభావాలను అర్ధం చేసుకున్న సార్, ఆత్రాఫ్‌ బల్దా’ అనే హైదరాబాద్‌లో సంపన్నులూ, దానిచుట్టూ కులీనులకు పని చేసే సేవకులు అంటూ  శాస్త్రీయంగా విశ్లేషించాడు. అందుకే  దీపం చుట్టూ  చీకటì లాగా నగరం చుట్టూ వెనుకబడ్డ ప్రాంతాలంటూ ఆత్రాఫ్‌ బల్దాకు సరైన  ని ర్వచనమిచ్చాడు. రాచరికంలో గీతగీసినట్టే  రంగారెడ్డి జిల్లా హైదరాబాదు చుట్టూ  వల యంలో  ఏర్పడ్డది. ఈ ప్రాంతాలను  వెనుకబడేయడం ద్వారానే నగరాల్లోని పెట్టుబడికి, శ్రమను అమ్ముకునే చీప్‌ లేబర్‌ దొరుకుతుంది.

అందుకే ఆయన జీవితమంతా సంపన్న  బస్తీలో నిరుపేదల కోసం దేవులాడుతూ సాగింది. ఉస్మానియాలో ఆంగ్లానికి  బదులు మాతృభాషలో ప్రవేశ çపరీక్షలుండేలా చేయడంలో తద్వారా దాన్ని  ఉద్యమ  కేంద్రంగా  మలచడంలో సార్‌ పాత్ర దండలో  దారంలా అల్లుకొని ఉంది. ఉస్మానియా విశ్వవిద్యా లయానికి  4 వేల ఎకరాల స్థలమిచ్చిన మహలఖాబాయి  చందా చరిత్రకు గానీ, భాషతో బడుగులకు ఉస్మానియాలో ప్రవేశం కల్పించిన జాదవ్‌ సార్‌కు గానీ నూరేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉత్సవాలు సరైన ప్రాధాన్యత కల్పించలేదు.

తెలంగాణలో చరిత్రను కోటిలింగాలకు  పూర్వపు బోదన్‌ జనపదం నుంచి అద్యయనం చేస్తున్న కాలమిది. దక్షిణాదిలోనే బలమైన సామ్రాజ్యానికి పునాదులేసిన కాకతీయ రాజులకే కరువులో కప్పం కట్టలేమన్న ఆదివాసీ వీరనారీమణులైన సమ్మక్క సారలమ్మల పోరాట చరిత్ర మనం విన్నదే. కాకతీయుల చివరి రాజు ్రçపతాపరుద్రున్ని ఢిల్లీ సుల్తానులు బందీగా తీసుకుపోతున్నప్పుడు (1330) సోమోద్బవ దగ్గర నర్మదానదిలో  దూకి ఆ త్మార్పణ చేసుకున్నాడు. దీనిని 1423 లోని కలువచెరువు శాసనం ‘‘దైవ నిర్ణయాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసిన వాడిగా’’ అభివర్ణించింది. తెలంగాణలో ఆత్మగౌరవ అంశాన్ని ఇక్కడినుంచే లెక్కంచాలని సార్‌  పేర్కొంటూ  ఉండేవారు.

1952  ముల్కి ఉద్యమంలో నిజాం కాలేజి  విద్యార్ధిగా  పాల్గొంటూ వచ్చాడు. 1968 డిసెంబర్‌లో  తెలంగాణ కోల్పోయిన 30,000 ఉద్యోగాల నుండి ప్రారంభమైన  ఉద్యమం 1969 మేలో రాజ్‌భవన్‌ వరకు  ర్యాలిగా పిలుపునిచ్చింది. 369  ప్రాణాలను అర్పిస్తూ సాగిన  ఈ ఉద్యమాన్ని అంచనావేయడానికి  జూన్‌ 4, 1969న హైదరాబాదు వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీని నిలదీసిన నాయకుడిగా జాదవ్‌ సార్‌కి పేరుంది. తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటులో డాక్టర్‌ గోపాలకృష్ణతో కలిసి కీలకపాత్ర పోషించినా, అది ఉద్యమానికి చేసిన ద్రోహాన్ని వ్యతిరేకించారు కానీ చివరివరకు ఉద్యమ సంస్థల్లోనే ఉండిపోయారు. 1990లలో నిర్మాణమైన తెలంగాణ ఐక్యవేదిక ద్వారా నిజమైన జాక్‌ అవగాహనకు ప్రాణప్రతిష్ట చేశాడు. ఉద్యమ శక్తులతో నిండిన ఈ వేదికలో కోదండరాం తర్వాత చేరారు. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా, గౌరవాధ్యక్షుడిగా నవ తెలంగాణకై కలగంటూ చివరిశ్వాస వదిలారు. 1989లో తెలంగాణ లిబరేషన్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ నుంచి ప్రారంభమై 1996లో ఏర్పాటైన వర్కర్స్‌ కాన్ఫరెన్సులో భాగమై బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిచారు. తెలంగాణ జనపరిషత్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.

మ్యాన్‌ కైండ్‌ అనే బహుభాషా పత్రిక సంపాదకుడిగా, కులనిర్మూలనా పోరాటానికి ద్వేషం ప్రాతిపదిక కారాదు అనే పుస్తక రచయితగా, ముస్లిం రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం పరితపించిన వ్యక్తిగా సమసమాజ భావుకుడిగా జాదవ్‌ సార్‌ మన కందించిన కర్తవ్యాలను తుదికంటా కొనసాగిద్దాం. అదే సార్‌కి నిజమైన నివాళి కాగలదు.

అమర్‌
వ్యాసకర్త జనశక్తి నాయకులు     
                                   

మరిన్ని వార్తలు