బెదిరించైనా బహిష్కరించైనా గెలవగలమా?

14 Jul, 2020 01:10 IST|Sakshi

అభిప్రాయం

చైనా వస్తువులు వాడటం మానేయడం ద్వారా మనం ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టగలమా? ఇప్పుడు సెలబ్రిటీలు డ్రాగన్‌ వస్తువులు బహిష్కరిద్దామని ఇస్తున్న పిలుపు చైనాకి నష్టమా, మనకా? కమ్యూనిస్టు పాలన ముసుగులో నియంత పాలన కొనసాగిస్తున్న చైనా, దాడి చేసైనా, ఆక్ర మిం‘చైనా’, బెదిరిం‘చైనా’ అన్ని రంగాల్లో ఆధిపత్యం నిలుç ³#కునే కుట్రలతో నెట్టుకొస్తోంది.

స్వేచ్ఛా వాణిజ్య ప్రపం చంలో చైనా ఆర్థిక  పెరుగుదల పెట్టుబడిదారీ పాశ్చాత్య వనరుల ప్రవాహం వల్లే సాధ్యమైంది. వాక్, పత్రికా స్వాతంత్య్రాల మాటే వినపడని చైనా ఇంకా మధ్యయుగపు ఆలోచనలతోనే పయనిస్తోంది. మన దేశానికి పెట్టని కోటలాంటి హిమాయాలను ఆనుకుని వున్న టిబెట్‌ను దురాక్రమించి స్వాధీనంలో ఉంచుకున్న చైనాతో మన దేశానికి సుదీ ర్ఘమైన సరిహద్దు ఉంది. చైనా దురాక్రమణ ప్రయత్నాలతో అది చాలాచోట్ల వివాదాస్పద సరిహద్దుగా మారింది.

కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనా కారణమని ప్రపంచమంతా వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో, అగ్రరాజ్యం అమెరికా చైనాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన కఠిన సమయంలో, కయ్యానికి కాలు దువ్వేందుకు మన దేశాన్ని ఎంచుకుంది చైనా. దీంతో మనదేశం ప్రతీకార చర్యకి దిగాల్సిందేనని ఒక్క మాట పైకొచ్చింది. చైనాని దెబ్బకొట్టాలంటే, వారి ఆర్థికశక్తిని దెబ్బకొట్టాలని ప్రముఖులు పిలుపు నిచ్చారు. సామాజిక మాద్యమాల వేదికగా సెలబ్రిటీలు చెనా తయారీ వస్తువులను బహిష్కరిద్దామంటూ ఒక ఉద్యమంలా చేపట్టారు. అయితే మన ఆర్థిక శక్తి, తయారీ శక్తిని చైనాతో పోలిస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది.

ప్రపంచ వాణిజ్య రంగంలో 2019 లెక్కల ప్రకారం మన దేశ వాటా కేవలం 3 శాతం అయితే, చైనాది 17 శాతం.  వస్తువుల వాడకం నిలిపేయడం ద్వారా చైనాను ఇబ్బంది పెట్టగలమా? చైనా వస్తువుల నిషేధం అనేది ఓ భావోద్వేగపు ప్రకటన గానే చూడాలి. వాస్తవంలోకి వస్తే పరిస్థితులు భిన్నంగా వుంటాయి. 2018 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చైనా చేస్తున్న ఎగుమతుల్లో భారతదేశా నికి చేస్తున్నవి 2.5 శాతం మాత్రమే. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో చైనాది 3వ స్థానం.

ఔషధ ఉత్పత్తులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ టెలికం, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  వంటివన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్‌. ఆటో మొబైల్‌ విడి భాగాలు (30%), సైకిల్‌ భాగాలు (50%), సెల్‌ఫోన్‌ విడి భాగాలు (70%), బొమ్మలు (90%) చైనా నుంచి వస్తున్నవేనంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. భారత్‌–చైనా సరిహద్దు ఉద్రిక్తతల భావోద్వేగానికి దేశ ప్రజలు గురవడం సహజం. దేశభక్తి ప్రకటన ఉండాల్సిందే. అయితే  మేడ్‌ ఇన్‌ చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునివ్వడం ద్వారా చైనాను అడ్డుకోవడం ప్రస్తుతానికి అసాధ్యం.

చైనా దిగుమతులపై ఆధారపడిన మనం ఆ దేశ ఉత్పత్తులు బహిష్క రిస్తామంటే, వివిధ రంగాల ఉత్పత్తుల కోసం బంగ్లాదేశో, వియత్నామో, కొరియా పైనో ఆధారపడాల్సిన పరిస్థితి. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మన దేశంలో విదేశీ వస్త్ర బహిష్కరణని ఒక ఉద్యమంగా చేపట్టారు. 1980 ప్రాంతంలో అమె రికాలో జపాన్‌ కార్ల వాడకంపై, 1990లలో గల్ఫ్‌ యుద్ధం కారణంగా అమెరికా ఉత్పత్తులు వాడొద్దంటూ మధ్య ప్రాచ్య దేశాలలో ఇటువంటి ఉద్యమాలే వచ్చాయి. తాత్కాలికమైన భావోద్వేగాలను చల్లార్చే వీటివల్ల వచ్చే ప్రయోజ నాలు గానీ, అటువైపుగా పెద్దగా నష్టపోయేవి గానీ ఏమీ వుండవు.

మనదేశంలో ఉత్పత్తి రంగం, వాణిజ్య రంగం స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు ఉపయోగపడిననాడు, భారతదేశ సెల బ్రిటీలు స్వదేశీ వస్తువులను మాత్రమే ప్రమోట్‌ చేస్తూ, స్వదేశీ వాణిజ్యవేత్తలను ప్రోత్సహించినపుడు ఇటువంటి వస్తుబహిష్కరణల పిలుపునకు అర్థం వుంటుంది. ఎందుకంటే, చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన దేశంలో తయారుచేసుకునే సామర్థ్యం సంతరించుకోవడానికి భారత్‌కు అను కూలత ఉంది. భారతదేశం లేబర్‌ ఫోర్స్‌ 52 కోట్లు ఉండగా, చైనా లేబర్‌ ఫోర్స్‌ 80 కోట్లు. ఆసియా ఖండంలో 14 కోట్లతో ఇండోనేషియా మూడో స్థానంలో ఉంది. నైపుణ్యం గల శ్రామిక లభ్యతలో భారత్‌ 47వ స్థానంలో ఉంటే, చైనా 41వ స్థానంలో ఉంది.

అయితే భారతదేశంలో 65% మంది 35 సంవత్సరాల లోపు వాళ్లే, 50% మంది 25 సంవత్సరాల లోపు వాళ్లే. దేశ తలసరి వయసు 29 ఏళ్లు. జపాన్‌ తలసరి వయసు 48 సంవత్సరాలు. అదే యూరప్, చైనా, అమెరికాలో వయసు దాదాపు 42 సంవత్సరాలు. అందువల్లే గత రెండు మూడు దశాబ్దాలుగా చైనా మాన్యుఫాక్చరింగ్, నైపుణ్యవంతమైన మానవ వనరులను సప్‌లై చేయ డంలో ముందుంది. కానీ రాబోయే రెండు మూడు దశాబ్దాలు మాన్యు ఫాక్చరింగ్‌లో భారత్‌వే. దాదాపు 15–20 కోట్లమందిని నైపుణ్యవంతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దిగలిగితే ప్రపంచానికి కావలసిన ఉత్పత్తులని భారత్‌ తయారు చేయగలదు.

కానీ భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ మరియు వాటిని పాలించే క్యాబినెట్‌ మంత్రులు అందరూ 70 సంవత్సరాల పైబడిన వారే. వారి ఆలోచనలు నేటి యువతరానికి ఉపయోగపడే విధంగా లేవు అనేది నా అభి ప్రాయం. ఏ వయసు వాళ్లలో ఆ వయసుకు తగిన విధంగా ఆలోచనలు ఉంటాయి. ప్రభుత్వాలు యువతను సంక్షేమ మరియు నిరుద్యోగ భృతి వైపు మరల్చకుండా నైపుణ్యత నేర్పితే వచ్చే రెండు మూడు దశాబ్దాలలో చైనా ఆర్థిక వ్యవస్థ కంటే భారత్‌  ముందుంటుంది.


వ్యాసకర్త:
 శ్రీనుబాబు గేదెల, పారిశ్రామికవేత్త

మరిన్ని వార్తలు