తిరుమలపై ఆధిపత్య రాజకీయం

14 Jun, 2018 00:59 IST|Sakshi

సందర్భం

ఎవరైనా కార్యక్రమాలు సరిగా నిర్వహించకపోయినా, సంస్థ ప్రయోజనాలకు నష్టం కలిగేలా ప్రవర్తించినా వారిపై చర్య తీసుకొనే అధికారం టీటీడీకి, ఆ సంస్థను శాసించే ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రమణ దీక్షితులు ప్రవర్తనలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తినపుడు వాటికి సమాధానం ఇవ్వకుండా, న్యాయపరమైన అధికారాలను పరిశీలించకుండా చర్యకు ఉపక్రమించడం దారుణం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి పూర్తి భిన్నంగా ఎందుకు చర్య తీసుకున్నదీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రాచీన తమిళ సాహి త్యంలో వడ వెంగడం  (ఉత్తర దిశగా ఉన్న పర్వ తం)గా అభివర్ణించిన తిరుమల క్షేత్రం చాలా పురాత నమైంది. ఎందరో రాజులు, ఎన్నో రాజవంశాల ఆద రణ ఈ హిందూ దేవాలయానికి లభించింది. వైష్ణవ మతాన్ని అభిమానించిన యాదవ రాజుల కాలంలో, విజయనగర రాజుల పాలనలో∙ఇది వైష్ణవ క్షేత్రంగా రూపుదిద్దుకుంది. రామానుజాచార్యులు ఏర్పరచిన విధి విధానాలను అనుసరించి ఈనాటికీ ఆలయ నిర్వహణ జరుగుతోంది.

రామానుజాచార్యులు తిరుమల ఆలయం దర్శించకముందే ఇక్కడ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆయన వాటిని స్థిరీక రిస్తూ తిరుమలలో మరికొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. ఆయన ఆమోదం పొందిన రెండు ప్రధాన సంప్రదాయాలైన సన్నిధి గొల్ల అర్చక వ్యవస్థ, సన్నిధి గొల ్లఅర్చకత్వ కైంకర్యం తిరుమల ఆలయం ఏర్పడిననాటి నుంచీ ఉన్నాయి. విష్ణుమూర్తి శేషాచలం కొండల మీద ఒక పుట్టలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓ ఆవు పాలను పుట్టలోకి విడవడం, అది గమనించిన పసు లకాపరి ఆవును అదిలించబోతే ఆ కర్ర విష్ణుమూర్తికి తగులుతుంది. ముందు కోపంతో శపించబోయిన విష్ణుమూర్తి ఆ యాదవుని ప్రార్థన మన్నించి తాను ఆ క్షేత్రంలో వెలసినప్పుడు ప్రథమ దర్శనం కలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఏర్పడిన కైంకర్యమే సన్నిధి కైంకర్యం.
 
నాలుగు కుటుంబాలకు అర్చకత్వం

గోపీనాథ్‌ అనే అర్చకునికి వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి తన విగ్రహం గురించి వివరించడంతో ఏర్పడిన కైంకర్యమే అర్చక కైంకర్యం. గోపీనాథ్‌ వార సులుగా ప్రకటించుకున్న నాలుగు కుటుంబాలవారు తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమ పద్ధతిలో అర్చ కత్వం నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబాల ఇంటి పేర్లు పెద్దింటి, గొల్లపల్లి, తిరుపతమ్మ, పైడిపల్లి. ఈ రెండు అతి ప్రాచీన కైంకర్యాలే కాకుండా రామానుజాచా ర్యులు పన్నెండో శతాబ్దంలో ఆకాశగంగ నుంచి స్వామివారి కార్యక్రమాలకు జలాలు తెచ్చే కైంక ర్యాలు తన మేనమామ అయిన తిరుమలనంబికి అప్పగించారు.
అదేవిధంగా తిరుమలక్షేత్రంపై ఉద్యానవనాన్ని నిర్వహించి స్వామివారిసేవకు పుష్పాలు సమర్పించే సౌకర్యాన్ని తన ప్రియశిష్యుడైన ఆనందాళ్వార్‌కు అప్పగించారు. అదేవిధంగా ఆలయాల్లో కైంకర్యాలు సక్రమంగా జరిగేటట్టు చూడటానికి, అర్చకులకు సహాయపడటానికి రామానుజులవారు జీయర్‌ వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు. కాలక్రమేణా ఈ కైంకర్యాల సంఖ్య 56కు పెరిగింది. ఇందులో పూల దండలు కట్టే యమునోతరి కైంకర్యం నుంచి ముగ్గు వేసే కైంకర్యం వరకు ఉన్నాయి. ఆర్జిత సేవల్లో వచ్చే ఆదాయాల్లో భాగాలు కేటాయించడం ద్వారా ఈ కైంకర్యాలు మిరాశీలుగా రూపొందాయి. ఈమిరాశీ విధానాన్ని 1986 దేవాదాయ చట్టం ద్వారా రద్దు చేశారు. ఈ మిరాశీ వ్యవస్థ రద్దయ్యే దాకా ఈ నాలుగు కుటుంబాల వారు వంతులుగా రెండు సంవత్సరాలకు ఒక కుటుంబం చొప్పున పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు.

ఒక విధంగా ఈ విధానానికి ఉడుపి శ్రీకృష్ణుని ఆలయ నిర్వహణకు పోలిక ఉంది. అక్కడ మఠాలు వంతుల ప్రకారం ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ కుటుంబాలు వంతుల వారీగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించే విధానం ఏర్పడింది. మిరాశీ వ్యవస్థ రద్దుతో ఈ వంతుల విధానం పోయి ఈ నాలుగు కుటుంబాల నుంచి నలుగురు పెద్దవారిని ప్రధానార్చకులుగా నియ మించే పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ విధానం కొనసాగుతున్న సమయంలో 2007లో వైఎస్‌ రాజ శేఖరరెడ్డి ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ తెచ్చి ఈ కైంకర్యాలకు వారసత్వ హక్కులు పునరుద్ధరించింది. ఆదాయంలో వాటా కల్పించే మిరాశీ విధానాన్ని మాత్రం పునరుద్ధరించలేదు. కేవలం ఈ చట్ట సవ రణ ద్వారా వారసత్వ హక్కులు మాత్రమే గుర్తిం చారు. ఇక ప్రస్తుతం ప్రధాన అర్చకుల్లో ఒకరైన ఏవీ రమణ దీక్షితులు చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని అంశాలను లేవనెత్తడం, వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు 65 సంవత్సరాలు నిండాయనే నెపంతో ఆయనతో పాటు మరికొంత మంది ప్రధాన అర్చకులను తొలగించడం తెలిసిందే.

అర్చకులకు ఎన్నికల హామీని మరచిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించినపుడు కొన్ని వర్గాలను పార్టీ చారిత్రకంగా దూరం చేసుకుందనీ, వారిని మళ్లీ ఆకట్టుకోవడానికి ప్రత్యేక కృషి అవసరమని పార్టీ లోని మేధో వర్గం భావించింది. తదనుగుణంగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనలో ఈ వర్గాలను దగ్గర చేసుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమం లోనే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఒక పేజీ బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ సామాజిక వర్గ సమస్యలను వివరంగా ప్రస్తావించిన ఈ పేజీలో ఒక ప్రధాన అంశంగా అర్చకుల విషయం పొందు పరచారు. అందులో ఏడో ప్రధాన అంశంగా ‘దేవా లయ పూజారులకు పదవీ విరమణ ఉండద’ని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోని ఈ వాగ్దానం చది వారో లేదోగాని అంతవరకు ఓటు వేయటానికి ఆసక్తి చూపని ఈ సామాజికవర్గానికి చెందిన అనేక మంది  ఉత్సాహంతో తెలుగు దేశం పార్టీకి ఓటు వేయడానికి ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి భిన్నంగా అర్చకుడు 65 ఏళ్లకు మించి కైంకర్యం నిర్వహించే హక్కు లేదని ప్రకటించారు. ఒక వంశంలో ప్రధాన అర్చకుడుగా ఒకరే ఉంటే మిగిలిన వారికి అవకాశం ఎలా వస్తుం దనే కోత్త అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ఫలితంగా అర్చకుల మధ్య కీచులాటలు మొదల య్యాయి.

దీనికంతటికీ కారణం రమణ దీక్షితులు పత్రికా సమావేశంలో కొన్ని అంశాలను ప్రస్తావించడమే. లేవనెత్తిన అంశాల్లో కొన్ని గంభీరమైనవి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఆ పనిచేయకుండా రమణ దీక్షితులుపై ఎదు రుదాడి ప్రారంభించారు. ఎవరైనా కార్యక్రమాలు సరిగా నిర్వహించక పోయినా, సంస్థ ప్రయోజనా లకు నష్టం కలిగేలా ప్రవర్తించినా వారిపై చర్య తీసు కొనే అధికారం టీటీడీకి, ఆ సంస్థను శాసించే ప్రభు త్వానికి ఎప్పుడైనా ఉంటుంది. సాధారణ పరిస్థి తుల్లో రమణ దీక్షితులు ప్రవర్తనలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కాని ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తినపుడు వాటికి సమాధానం ఇవ్వకుండా, న్యాయపరమైన అధికారాలను పరిశీలించకుండా చర్యకు ఉపక్రమిం చడం దారుణం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి పూర్తి భిన్నంగా ఎందుకు చర్య తీసుకున్నదీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం తిరుమల తప్ప మిగిలిన అన్ని దేవా దాయాలపై అక్కడి ధార్మిక వ్యవస్థ సిబ్బందిపై  పూర్తి ఆధిపత్యాన్ని గత 30–40 ఏళ్లలో సాధించింది.  

పూర్తి ఆధిపత్యం చిక్కని క్షేత్రం తిరుమల 
తిరుమల అనువంశిక అర్చక వ్యవస్థలో విషయ పరి జ్ఞానం కలిగి, అధికారుల నియంత్రణకు పూర్తిగా దాసోహం అనకుండా నిలబడగలిగిన అర్చకులు రమణ దీక్షితులు. మిగిలిన వారికి ఆయనకున్న శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన తొలగింపుతో తిరుమల క్షేత్రాన్ని చంద్రబాబు నాయుడు తన అనుకూల అధి కారగణం సాయంతో అప్రతిహతంగా ఏలవచ్చు. పదవీ విరమణ అనే అంశం తిరుమల కన్నా చిన్న దేవాలయాలకు చాలా ప్రధాన సమస్య. సరైన ప్రత్యామ్నాయాన్ని ఆలోచించకుండా 1986 దేవాదాయ చట్టం ద్వారా అనువంశిక ధర్మకర్తలను తొలగించడం, ఈనాములను రద్దు చేయడం, వారసత్వ హక్కులను తీసేయడం జరి గింది. దీనితో చిన్న దేవాలయాల పరిస్థితి దారు ణంగా తయారైంది. అనువంశిక ధర్మకర్తల స్థానంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవస్థాన పాలక మండలులు ఏర్పాటు చేసి వాటి పెత్తనం కింద అర్చకుడిని పెట్టారు. ఇక దేవాదాయ, ధర్మాదాయ శాఖను విస్తరించి అధికారుల అజమాయిషీ పెంచారు. వీరందరి కిందా ఆదాయం లేని, జీతాలు చాలని అర్చక, ధార్మిక సిబ్బంది నలిగిపోతున్నారు. విచిత్రమేమిటంటే  సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం దేవాలయానికి వచ్చే ఆదాయంలో మొదట అర్చ కులు, ధార్మిక ఉద్యోగుల జీతాలు భరించాలి. అయితే ఆచరణలో ముందు లౌకిక ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికే ఆదాయం ఉపయోగిస్తున్నారు. ఈ వాస్తవాన్ని ప్రశ్నించేవారే కనిపించడం లేదు. అర్చకులకు, ధార్మిక సిబ్బందికి అక్కడ సంభావన ఇవ్వడానికి ఏమీ మిగలడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా రూపొందించినదే ముసాయిదా ప్రభుత్వ ఉత్తర్వు 76. అర్చకులకు, ఇతర ధార్మిక సిబ్బందికి పదవీ విరమణ లేకుండా చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వు రూపొందించారు.

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని అంశాలకను గుణంగానే దేవాలయాల నిర్వహణపై రూపొందిం చిన ఉత్తర్వు ఇది. కానీ ఈ ప్రభుత్వం ఈ ముసా యిదా ఉత్తర్వుకు పురిటిలోనే సంధి కొట్టింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించడా నికి నాలుగేళ్లుగా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు రమణ దీక్షితులు వివాదం రావడంతో ఒక నెలలో ముసా యిదా ఉత్తర్వు అంశం పరిష్కరిస్తామని అస్మదీయ  ప్రసార మాధ్యమాల ద్వారా లీకులు ఇచ్చారు. ఉత్తర్వు  ఇవ్వదల్చుకుంటే  ఒక్కరోజులో పని. ఇది ప్రాథమిక ప్రకటన తర్వాత అభ్యంతరాలు తెలిపే గడువు ముగిసి ఏడాది దాటినా ఉత్తర్వు వెలువడ  లేదు. ఇప్పటికైనా ఈ ఉత్తర్వును వెంటనే జారీ చేస్తే ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపే వారిలో నేను ప్రథముడిగా ఉంటాను.


ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  iyrk45@gmail.com

 

మరిన్ని వార్తలు