వన్నె తగ్గుతోన్న ఉపాధ్యాయ విద్య

19 Jun, 2019 02:54 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ విద్య  ప్రాభవం ఏటికేటికీ కొడిగడుతోంది. రెండు దశాబ్దాల కిందట ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఓ భరోసా, ప్రత్యేక గౌరవం ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. విచ్చల విడిగా ప్రైవేటు కళాశాలలకు తలుపులు తెరవడమే దీనికి ప్రధాన కారణం. ఏటా డిగ్రీ ప్రాతిపదికగా బీఎడ్, ఇంటర్‌ ఆధా రంగా డీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అయితే వీటికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పదేళ్ల కిందట లక్షల్లో పోటీపడే అభ్యర్థులు  ఇప్పుడు వేలకు పడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018 లెక్కల ప్రకారం 13 ప్రభుత్వ డైట్‌ కళాశాలలుండగా 869 ప్రైవేటు యాజ మాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలకు 1300 సీట్లుండగా ప్రైవేటుకు 44,500 సీట్లను కేటాయిం చారు.

తెలంగాణలో 180 డీఎడ్‌ కళాశా లలకుగాను ప్రభుత్వానికి చెందిన 28 కళాశాలల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 850 సీట్లుండగా ప్రైవేటు కళాశాలలకు 6,500 సీట్లను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ సీట్లన్నీ పూర్తి స్థాయిలో భర్తీకావడం లేదు. ఏటా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టక పోవడం, నోటిఫికేషన్‌ విడుదలైనా తక్కువ పోస్టులకు పరిమితం చేయడం, దీనికి కారణం.. గతేడాది సుప్రీంకోర్టు సైతం సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ పోస్టు లకు బీఎడ్‌ వారికీ అవకాశమివ్వాలని ఎన్‌సీటీ ఈని ఆదేశించింది. దీంతో డీఎడ్‌ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు విము ఖత చూపుతున్నారు. పర్యవసానమే ఈ ఏడాది అతి తక్కువగా 19,190 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 2001–2005 వరకు బీఎడ్‌ ప్రవేశాలకు గిరాకీ ఉండేది.

2009లో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ పోస్టులకు డీఎడ్‌ వారినే తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నివ్వడంతో బీఎడ్‌ కోర్సుకు స్పందన క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత పదే ళ్లలో డీఎడ్, బీఎడ్‌ చేసిన వారు రెండు రాష్ట్రాల్లో కలిపి 9లక్షలకు పైనే ఉంటారు. వీళ్లలో 80 శాతం మంది సర్కారు కొలు వులు రాక ప్రైవేటు విద్యా సంస్థల్లో తక్కువ ఊడిగానికి పనిచేయలేక ఉపా ధ్యాయ వృత్తిని వదిలి ప్రైవేటు రంగా  లకు మళ్లారు. ఉపాధ్యాయ విద్యను  చుట్టుముట్టిన సమస్యల పరిష్కారానికి ప్రైవేటు కళాశాలల సంఖ్య తగ్గించాలి. జిల్లాకు రెండు, మూడింటికే పరిమితం చేయాలి. బోధనా పద్ధతుల ప్రమాణా లను పెంచాలి. ఏటా నియామకాలు చేపట్టాలి. ప్రైవేటు పాఠశాలలు కనీసం రూ. 15 వేల వేతనమిచ్చేలా చట్టం తీసు కురావాలి. ఇలా చేస్తే ఉపాధ్యాయ విద్యకు మునుపటి వైభవం వస్తుంది. 
-తిరుమల శ్రీనివాస్‌ కరుకోల, హైదరాబాద్‌
సెల్‌ : 81438 14131

మరిన్ని వార్తలు