ఆదివాసీల భవితకు భరోసా

3 Nov, 2017 00:54 IST|Sakshi

సందర్భం

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అటవీ అధికారుల సమావేశంలో ఎవరు చెబితే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా నర్మగర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి.

గిరిజన స్త్రీలను, పసిపిల్లలను చెట్టుకు కట్టేసి లాఠీలతో చితక బాదుతున్న ఆటవిక సంఘ టన నన్ను కలవరపెట్టింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవుల్లో జలగలంచ గొత్తి కోయలకు చెందిన 30 మందిపై  300 మంది ఫారెస్టు సిబ్బంది చుట్టుముట్టి  గొడ్డును బాదినట్టు బాదిన ఘటన అది. పోస్కో, వేదాంత  కార్పొరేట్‌ కంపెనీలకు అడవిని అప్ప గించటం కోసం  గ్రీన్‌హంట్‌ పేరుతోనో.. పులుల సంర క్షణ పేరుతోనో మాడ్‌ జాతులను వేటాడుతున్న వేళ  కోయ, గోండు, గొత్తికోయలు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణ అడవుల్లోకి వచ్చి నిమ్మల పడ్డారు. ప్రాంతం వేరైనా అడవి ఒక్కటే. జంగల్‌ వాళ్లది, జమీన్, జల్‌ వాళ్లదే. వాళ్ల అడవిలో వాళ్లను వది లేయటమే న్యాయం. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడు ఏజెన్సీలో 10 ఎకరాల లోపు భూమి సాగు చేసుకోవచ్చు. ఫారెస్టు అధికారులు చట్టాన్ని అతిక్రమించి గుడిసెలు పీకేసి, జీవనవిధ్వంసం చేసి నిర్వాసితులను చేయటం పార్లమెంటును దునుమా డటమే. ఈ అమానవీయ సంఘటనను అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నా. కానీ ముందుగానే సీఎం కేసీఆర్‌ మానవత్వం చూపించారు. గొత్తికోయ లపై దాడిని తీవ్రంగా గర్హించారు. దాడులకు దిగిన ఫారెస్ట్‌ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఇది తొలి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు  దక్కిన భరోసా.

అడవిపై అప్పటి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ముండాలు, భిల్లులు, గోండులు, కోయలు, గొత్తికో యలు, కొండ రెడ్లు  తిరుగుబాట్లు చేశారు. ఆ మాట కొస్తే  క్రీపూ 431–404  పాల్పెనెసియన్‌ యుద్ధ కాలం నుంచి భూమిపై అధికారాలు, హక్కులు సంపాదించే క్రమంలో ఆదివాసీల భూములు ఆక్రమణకు గురి అవు తున్నాయి. భూములను, హక్కులను తిరిగి కాపాడు కునే క్రమంలో ఆదివాసీలు అప్పటి నుంచే పోరాట పంథాను ఎంచుకున్నారు. వాళ్ల ప్రతి పోరాటంలో భూ సమస్య ఉంది. ఆ భూముల్లో వాళ్ల బతుకు ఉంది. గిరి జన తిరుగుబాట్లను  పాలకులు ఎప్పటికప్పుడు అణిచి వేస్తూనే ఉన్నారు. ఆదివాసీ పోరాటాలవల్లే 1917లో, 1959లో ఆదివాసీ భూ పరిరక్షణ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాన్ని తుంగలో కలిపినప్పుడే గోదావ రిలోయ ప్రతిఘటనా పోరాటాలు, దండ కారణ్య ఉద్య మాలు పుట్టుకొచ్చాయి. ఆపై ప్రభుత్వం 1/70 చట్టం, పీసా (పంచాయతీరాజ్‌ విస్తరణ) చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. ఉమ్మడి ఏపీలోని శ్రీకా కుళం నుంచి మహబూబ్‌నగర్‌ దాకా 31,845 చదరపు కిలో మీటర్ల వరకు గిరిజన ఉపప్రణాళిక ప్రాంతం విస్త రించి ఉంది. అయితే దాదాపు 845 గిరిజన గూడేలను, పెంటలను 5వ షెడ్యూల్‌లో చేర్చనందునే భూ పరి రక్షణ చట్టాలు ఉన్నా అమలు కావటం లేదు.

రిజర్వు టైగర్‌ ప్రాజెక్టుల్లో పులికి, ఆటవికులకు మధ్య సంఘర్షణ జరుగుతోందని అటవీ సంరక్షణ అధికారులు చెప్తున్నారు. వారిని అడవి నుంచి బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆదివాసీ కూడా అటవీ ఆవరణ వ్యవస్థలో ఒక అంతస్థే. అడవి జంతువుకు, ఆదివాసీకి మధ్య ఒక స్పష్టమైన జీవన సర్దుబాటు ఉంది. ఆదివాసీలు సాయంత్రం ఐదు గంటల లోపే పనులు ముగించుకొని రాత్రి 7 గంటల లోపు వండుకొని తిని పడుకుంటారు. ఆ వేళకే అడవి జంతువులు బయటికి వస్తాయి. సూర్యోదయం వరకు యథేచ్ఛగా సంచరిస్తాయి. సూర్యోదయం తరువాత మళ్లీ ఆదివాసీ జీవన గమనం మొదలవుతుంది. ప్రకృతే వారికి ఆవిధంగా సర్దుబాటు చేసింది. ఇక్కడ పులికి ఆదివాసీకి బలమైన బంధుత్వం ఉంది. ఆదివాసీ పులిని  బావ(పులిబావ) అని సంబోధిస్తాడు. ఆదిమ జాతుల్లో బావే ఆత్మీయుడు. పులి గాండ్రిస్తే కాలం కలిసి వస్తుం దని, చెట్టు ఫలిస్తుందని ఆదివాసీల నమ్మకం. ఎప్పటికీ వాటి క్షేమాన్నే కోరుకునే ఆదివాసీలతో పులి ఎక్కడ సంఘర్షణ పడుతుందో అటవీ శాఖ పెద్దలకే తెలియాలి.

గ్లోబలైజేషన్‌లో భాగంగానే ఆధిపత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కన్నేశాయి. విస్తా రమైన ఖనిజ సంపదను తవ్వి పట్టుకుపోవటానికి కార్పోరేట్‌ శక్తులు  యుక్తులు, కుయుక్తులతో వల విసు రుతున్నాయి. ప్రకృతిని వడిపెట్టి  ధ్వంసం చేసి డాలర్లు పిండుకునే తరహా అభివృద్ధి, దాని విస్తరణ వన జీవుల ప్రాణాలను తోడేస్తోంది. ఈ విలయం ఆగాలి. అపు రూప మానవ తెగలను అడవిలోనే బతకనివ్వాలే. ఇటీ వల సీఎం కేసీఆర్‌ అటవీ అధికారుల సమావేశంలో  ఎవరు చెప్తే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. వాళ్ల అడవిలో వాళ్లే ఉంటారనే సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్‌ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక సబ్‌ ప్లాన్‌తో 2017–18 బడ్జెట్‌లో రూ. 6,112 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో 60 శాతం నిధులు ఇప్పటికే ఖర్చు చేసింది. గిరిజన యువతీ యువకుల్లో నైపుణ్యం వెలికితీసి వారిని తీర్చి దిద్దటం కోసం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో 500 ఎకరాలలో గిరి జన వర్సిటీని  నెలకొల్పబోతోంది. గిరిజన సంస్కృతి, సాహిత్యాన్ని పాఠ్యాంశంగా చేయటంతో పాటు వాటిపై విస్తృతమైన పరిశోధనలు జరుగనున్నాయి.



సోలిపేట రామలింగారెడ్డి

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే
మొబైల్‌ : 94403 80141

మరిన్ని వార్తలు