యోగి పాలనలో ఆటవిక రాజ్యం

3 Oct, 2018 00:47 IST|Sakshi

వివేక్‌ తివారీ హత్య, ఆడపిల్లను పోలీసులు వేధించిన తీరు చూస్తే ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్నది జంగిల్‌రాజ్‌ కాక మరేంటి? తివారీ వంటి అమాయకుడు పొరపాటున హతుడైనా గాని మిగిలిన తొమ్మిది మంది నేరస్తులు ఎన్‌కౌంటర్లలో మరణించడం మంచిదేగా అనే ధోరణి మామూలు జనంలో కనిపిస్తోంది. చట్టబద్ధతపై నమ్మకం లేని పోలీసు బల గాలను ఆదిత్యనాథ్‌ సర్కారు జనంపై ప్రయోగిస్తోంది. ఎవరైనా చావాలా లేక బతకాలా అనే విషయాన్ని కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్‌లే ఒకట్రెండు క్షణాల్లో నిర్ణయిస్తున్నారు. పోలీసు దళం ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుల బృందంగా మారిపోతోంది. కారు ఆపనందుకు ఓ సామాన్యుడిని పోలీసులు కాల్చిచంపే స్థాయికి ఎన్నడూ రాష్ట్రం దిగజారిపోలేదు.

ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ ఓపీ సింగ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో మేరuŠ‡కు అధికార పర్యటనపై వెళ్లి, ‘‘ఈ రోజేమీ ఎన్‌కౌంటర్‌ చేయలేదు కదా?’’ అని శామ్లీ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ అజయ్‌పాల్‌ శర్మను ప్రశ్నించారు. శర్మ నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఈ విషయంపై శర్మ మాట్లాడుతూ డీజీపీ సరదాగా ఈ ప్రశ్న వేశారనీ, ఉదయం అదనంగా మరో రొట్టె తిన్నారా? అన్నట్టుగా భావించాలని ఇతర అధికారులకు చెప్పారు. ఇలా సర్కారీ ఆదేశాలపై జరిగే హత్యలపై సరదాగా మా ట్లాడడం అంటే, జనాన్ని చంపడానికి తమకు లైసెన్సు ఉన్నట్టుగా కింది స్థాయి పోలీసు వరకూ భావిస్తారు. ఎడాపెడా ఎన్‌కౌంటర్లు చేసే మని షిగా శర్మకు పేరుంది. కిందటి ఆగస్ట్‌లో ఇద్దరు పేరుమోసిన నేరస్తులను కాల్చిచంపినప్పుడు శర్మను స్థానికులు రథంలో ఊరేగించి సన్మా నించారు. హర్‌దువాగంజ్‌ పట్టణంలో కొందరు నేరస్తులతో ఎన్‌కౌంటర్‌ జరుగుతోందని అలీగఢ్‌లోని జర్నలిస్టులకు సెప్టెంబర్‌ ఉదయం ఆరున్నరకు కబురొచ్చింది. వెంటనే వారు సంఘటనా స్థలానికి వచ్చి ప్రత్యక్షంగా చిత్రీకరించారు.

ఒక్కొక్కరి తలపై రూ.25 వేల వెలలున్న ఇద్దరు నేరగాళ్లను ముస్తాకీమ్, నౌషాద్‌గా గుర్తించారు. వారిద్దరూ ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మొదట వారు కాల్పులు జరపగా, తాము వారిని వెంబడించామని ఎప్పటిలాగానే పోలీసులు చెప్పారు. నౌషాద్‌ తల్లి మాత్రం, తన కొడుకు, ముస్తాకీమ్‌ను తన ఇంటి నుంచే పోలీసులు పట్టుకుపోయి చంపేశారని తెలిపింది. కిందటి వారం ఓ యువతిని మేరuŠ‡ పోలీసులు విశ్వహిందూ పరిషద్‌ గూండాల నుంచి కాపాడారు. ముస్లిం స్నేహితుడితో కలిసి ఉన్న ఆమెను ఈ దుండగులు ‘లవ్‌ జిహాద్‌’ పేరుతో వేధించారు. తర్వాత పోలీసులు ముస్లిం కుర్రాడితో ఎందుకు తిరుగుతున్నావంటూ ఆమెను సతాయించి, దౌర్జన్యం చేయడం ఆమెను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘‘అనేక మంది హిందువులుండగా, మీరు ముస్లింలంటేనే ఎందుకు ఇష్టపడతారు?’’ అంటూ ఓ అధికారి ప్రశ్నించడం పోలీసులు రికార్డు చేసిన వీడియోలో వినిపించింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఓ మహిళా అధికారి సహా నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. తర్వాత వారిని సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సొంత జిల్లా గోర ఖ్‌çపూర్‌కు బదిలీచేశారు. పోలీసు వృత్తికి తగని భయానక ప్రవర్తనకు ఇది శిక్షా లేక బహుమతా? అనేది స్పష్టం కాలేదు. 

లక్నో పోలీసు హత్య!
సెప్టెంబర్‌ 28 రాత్రి రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగిన ఘటనపై ఆశ్చర్య పడాల్సిందేమీ లేదని చెప్పడానికే పై మూడు ఘటనల గురించి నేను వివరించాను. ఆదిత్యనాథ్‌ ఏలుబడిలో దాడిచేసి, చంపడానికి పోలీసులకు లైసెన్సులిచ్చారు. యాపిల్‌ కంపెనీలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న వివేక్‌ తివారీని శనివారం తెల్లవారుజామున ప్రశాంత్‌ చౌధరీ, సందీప్‌ రాణా అనే ఇద్దరు లక్నో పోలీసులు దగ్గర నుంచి కాల్చి చంపారు. రాత్రి గస్తీ పోలీసులు చెప్పినా తన కారు ఆపకుండా పోవడమే అతని నేరం. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు వాహనం టైర్లను లేదా మరో భాగంపై మాత్రమే కాల్చాలి. తివారీ ముఖంపై ప్రశాంత్‌ చౌధరీ కాల్పులు జరిపాడు. తర్వాత తమ నేరం కప్పిపుచ్చడానికి పోలీసులు కట్టుకథలల్లారు.

ఆఫీసులో ఓ కార్యక్రమం ముగిశాక తన సహోద్యోగి సనాను ఆమె ఇంటి వద్ద దింపడానికి తీసుకెళుతున్న తివారీ కారు అప్పుడు ఆగి ఉందని పోలీసులు చెప్పారు.అంటే వారు ‘అనుచిత’ పని చేయడానికి సిద్ధమౌతున్నారనే భావన కలిగేలా ఈ ప్రచారం చేశారు. మరణించిన వ్యక్తిపై బురద జల్లడానికి ఇలా ప్రయత్నించారు. అయితే, ఈ కథే నిజమనుకున్నా అతన్ని చంపడానికి అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?  పోలీసుల మోటార్‌ సైకిల్‌ను తివారీ ఢీకొట్టి ఆగకుండా పోతున్న కారణంగా పోలీసులు కాల్పులు జరిపారనేది రెండో కట్టుకథ. తివారీ ప్రమాదం కారణంగా మరణించాడనేది మూడో కథనం. తివారీని అతి సమీపం నుంచి కాల్చారని శవపరీక్షలో తేలింది. అంటే ఇది కావాలని చేసిన హత్య. తివారీ కారును ఆపకుండా పోవడం అనేది యూపీలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. అర్ధరాత్రి రోడ్లపై బలవంతపు వసూళ్లు చేసే అలవాటు పోలీసులకు ఉంది. పోలీసులతో గొడవపడడం ఇష్టంలేకే తివారీ కారు ఆపలేదు. అదీగాక తనను ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీసు దుస్తుల్లో ఉన్న పోలీసులా లేక నేరస్తులా అనే అనుమానం సహజంగానే పీడిస్తుంది. 

ఆదిత్యనాథ్‌ పాలనలో దాదాపు 1500 ఎన్‌కౌంటర్లు!
ఆదిత్యనాథ్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దాదాపు 1500 ఎన్‌ కౌంటర్లు జరగడంతో యూపీకి ఎన్‌కౌంటర్‌ రాజ్యంగా ముద్ర పడింది. నేరస్తులని ముద్రవేసి 66 మందిని పోలీసులు చంపారు. వారం తా ముస్లింలే కావడంతో పౌరసమాజం వీటిని పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమాలు ముస్లింను ఉగ్రవాదిగా, నేరస్తునిగా చిత్రిం చడం వల్ల ఈ ఎన్‌కౌంటర్లను ఎవరూ ప్రశ్నించడం లేదు. తాము పోలీ సులకు లక్ష్యం కాలేదనే సంతోషంతో హిందువులు పోలీసులు చెప్పింది విని ఊరుకుంటున్నారు. బులెట్లతో అధికారంలో కొనసాగడానికి అనేక ఎన్‌కౌంటర్లు చేయడం తప్పుకాదనే అభిప్రాయానికి ప్రభుత్వ ఆమో దముద్ర లభిస్తోంది. నేరాలు నివారించడానికి అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే పోలీసు ఎన్‌కౌంటర్లని యూపీ డీజీపీ పేర్కొన్నారు. ‘వృ త్తిపరమైన, వ్యూహాత్మక పద్ధతిలో నేరస్తులతో తలపడటమే ఎన్‌కౌంటర్,’అని ఆయన కొత్త నిర్వచనం చెప్పారు.

పోలీసులు విచక్ష ణారహితంగా కాల్చిచంపడాన్ని సామాన్య ప్రజానీకం మద్దతు పలకడం మరింత  చిరాకు పుట్టించే విషయం. తివారీ వంటి అమాయకుడు పొరపాటున హతుడైనాగానీ మిగిలిన తొమ్మిది మంది నేరస్తులు ఎన్‌కౌం టర్లలో మరణించడం మంచి దేగా అనే ఆలోచనా ధోరణి మామూలు జనంలో కనిపిస్తోంది. నేర స్తులను మొదట అరెస్ట్‌ చేసి, ప్రాసిక్యూట్‌ చేయడానికి కోర్టు విచారణ ప్రక్రియ వాడుకోవాలనే చట్టబద్ధ విధా నంపై నమ్మకం లేని, తగిన శిక్షణ లేని పోలీసు బలగాలను ఆదిత్యనాథ్‌ సర్కారు జనంపై ప్రయోగిస్తోంది. ఎవరైనా చావాలా లేక బతకాలా అనే విషయాన్ని కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్‌లే ఒకట్రెండు క్షణాల్లో నిర్ణయి స్తున్నారు. పోలీసు దళం మొత్తం ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుల బృందంగా మారిపోతోంది. ఒక్క మేరఠ్‌ జోన్‌లోనే ఇప్పటి దాకా మూడో వంతు ఎన్‌కౌంటర్లు జరిగాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాలనలోని బిహార్‌ పాలనను బీజేపీ నేతలు ‘ఆటవిక రాజ్యం’ అని నిందించేవారు. వివేక్‌ తివారీ హత్య, ఆడపిల్లను పోలీసులు వేధించిన తీరు చూస్తే ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్నది జంగిల్‌ రాజ్‌ కాక మరేంటి? పోలీసు యూనిఫాం ధరించినవారు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేయడం మరింత దారుణం. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో పాలకపక్షం మద్దతుతో యాదవ కులానికి చెందిన గూండాలు రెచ్చిపోయారు. ఇది ఖచ్చితంగా తప్పే. కారు ఆపనందుకు ఓ సామాన్యుడిని పోలీసులు కాల్చిచంపే స్థాయికి అప్పుడు రాష్ట్రం దిగజారిపోలేదు. 

తివారీ హత్యపై ఎందుకింత కలవరం?
తివారీ హత్యపై ఇప్పుడు రేగిన కలవరం గతంలో ఇలాంటి సందర్భాల్లో ఎందుకు కనపడలేదు? ఎందుకంటే తివారీ మన లాంటి వ్యక్తి. ఎగువ మధ్య తరగతి చెందిన తివారీ లక్నోలోని సంపన్న ప్రాంతంలో నివసిస్తూ బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్య విషయం అతను హిందువు. తర్వాత అతని భార్య చెప్పినట్టు తివారీ కిందటేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశాడు. ‘బీజేపీకి ఓటేశాక మాకు దక్కా ల్సింది ఇదేనా?’అని అతని కుటుంబం ప్రశ్నించింది. ‘ఇలాంటివి కశ్మీర్‌ లోనేగానీ యూపీలో జరగవని ఆశించాం,’అని మరో కుటుంబ సభ్యుడు బాధతో చెప్పాడు. కానీ, కశ్మీర్‌లోయలో అమాయకులను చంపడంలో తప్పేమీ లేదనే భావం స్ఫురించేలా మాట్లాడడం అన్యాయం. తివారీ హిందువు కాకపోతే ప్రభుత్వం స్పందన భిన్నంగా ఉండేదా? గత అను భవాలను గుర్తుచేసుకుంటే, మరణించిన వ్యక్తి ముస్లిం అయితే అతనికి ఐఎస్‌ఐ లేదా ఐఎస్‌ఐఎస్‌తో ముడిపెట్టి కట్టుకథలు మీడియా ద్వారా ప్రచారంలో పెట్టేవారు. తివారీ ఎన్‌కౌంటర్‌ విషయంలో కూడా పోలీ సుల్లో తప్పుచేశామనే భావన కనిపించలేదు. పోలీస్‌ స్టేషన్‌లో కాని స్టేబుల్‌ చౌధరీ మొండిగా వాదిస్తూ మాట్లాడాడు.

ఈ కేసులో ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకోవాలంటూ తమ కుటుంబానికి జిల్లా కలెక్టర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయని తివారీ కూతురు చెప్పింది. ఈ సంఘటనలో ఏకైక ప్రత్యక్ష సాక్షి సనాతో పోలీ సుల కథనం రాసిన తెల్ల కాగితంపై సంతకం చేయించారు. పొరపాటున తగిలిన బులెట్‌తో తివారీ మర ణించాడనే పోలీసుల కథనానికి సనా ఇలా అంగీకారం తెలపాల్సి వచ్చింది. జనాగ్రహం కట్టలు తెంచుకోవడంతో యూపీ ప్రభుత్వ నేతలు కొంత దిగిరావడంతో పోలీసు కానిస్టేబుళ్లలో గుట్టుతిరుగుబాటు తలె త్తుతోంది. తివారీని కాల్చి చంపిన ప్రశాంత్‌ చౌదరీకి మద్దతుగా ఆన్‌లైన్‌ ప్రచా రోద్యమాన్ని పోలీ సులు ప్రారంభించారు. చౌధరీ తరఫున కోర్టు ఖర్చు లకు విరాళాలు ఇవ్వాలని కోరగా, అక్టోబర్‌ ఒకటికి రూ.5 లక్ష లకుపైగా వసూ లయ్యాయి. ఇది రాష్ట్రంలో పోలీసుల ధోరణికి అద్దం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల, ఎన్నికలు కొన్ని మాసాల్లో వస్తున్న కారణంగా ఈ పోలీసు హత్యపై ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాగానే తివారీ కుటుం బాన్ని ఆదిత్యనాథ్‌ పరామర్శించి, అతని భార్యకు ఉద్యోగంతోపాటు నష్టపరిహారం ప్రకటించారు. ఇది ఈ కుటుంబానికి తాత్కాలిక ఊరట మాత్రమే. పోలీసు ఉద్యోగం అంటే ప్రజలను చంపే దుర్మార్గమైన బలగం కాదనే స్పృహ వారిలో ఆదిత్యనాథ్‌ కలిగించకపోతే యూపీలో ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలు కొనసాగుతూనే ఉంటాయి. 

టీఎస్‌ సుధీర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
ఈ–మెయిల్‌:  tssmedia10@gmail.com

>
మరిన్ని వార్తలు