ముమ్మాటికీ మనమే నేరస్తులం

14 May, 2020 01:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌బాక్స్‌

మనిషి సంఘజీవి. సంఘంలో ప్రాతినిధ్యం ప్రారంభమైన దశ నుంచి (గ్రీకుల కాలం తరువాత) తన ప్రాబల్యం కోసం స్వార్థ చింతన పెంచుకోవడం ప్రారంభించాడు. అక్కడ ప్రారంభమైన ఈ స్వార్థం ఎక్కడికి దారితీసిందంటే తన సొంత మనుషులకు కూడా ప్రమా దం జరిగిందంటే ఆందోళన చెందనంత స్థాయికి చేరుకుంది. మహాకవి కాళోజీ గారన్నట్లు ‘తనకు అందినంత వరకు తనదని, తనకు అందనిది, కనిపించినంత వరకు మనదని’ సొమ్ము చేసుకు నేంత స్వార్థం మనిషిలో పెరిగి పోయిన కాలంలో  తన సౌకర్యం, విలాసాల కోసం ప్రకృతిని వాడు కుని నాశనం చేయడం ప్రారం భించి, అదే పరోక్షంగా తన వినాశ నానికి కారణం అయ్యేంతవరకూ తెచ్చుకున్నాడు.  

స్వైన్‌ఫ్లూ, ఎబోలా,  ‘జికా’. ఈ వైరస్‌లకు పూర్తి వైవిధ్య మైనది నేడు మనం ఎదుర్కొంటున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’. మానవ ఆరోగ్య చరిత్రలో మొదటి వైరస్, వ్యాధి అయిన సిర్సాను సృష్టించిన చైనానే కరోనా వైరస్‌ వ్యాప్తికి కూడా దోహదం చేసింది. చైనాలోని వూహాన్‌ నగరంలో మొదటి కేసు నమోదై మొత్తం దేశం వ్యాపించి   ప్రపంచాన్ని చుట్టేసింది. చిన్న చిన్న దీవుల నుంచి అగ్ర రాజ్యమైన అమెరికా వరకు బీద బిక్కి, ధనిక దక్కి  లేకుండా భయ కంపితులను చేస్తోంది.

చైనా తర్వాత అత్యంత జనాభా కలిగిన దేశం మనది.  ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంకన్నా మన ఆహార్యం గొప్పది, మెడిసిన్‌ కన్నా మన మేధస్సు గొప్పది. ఐక్యతే ఈ దేశంలో మహ మ్మారిని కట్టడి చేయగలుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదం లేకుండా దేశమంతా ఒక్కటే అన్న నినాదంతో ప్రధాని సూచనను  తప్పకుండా పాటిస్తూ కరోనాను ఐక్యంగా  తరిమికొట్టడానికి సిద్ధ పడుతున్నారన్నది నిర్వివాదాంశం. కనుక భౌతిక దూరం, స్వీయ గృహ నిర్బంధం ఇకపైనా పాటిద్దాం.  
– కొండల్‌  ప్రజాపతి,రాజనీతి శాస్త్ర పరిశోధకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం 
మొబైల్‌ : 96763 54999 

>
మరిన్ని వార్తలు