టెలిఫోన్‌ లేని ప్రపంచం ఊహిద్దామా?

17 May, 2018 02:30 IST|Sakshi

మానవచరిత్రలో మార్చి 10, 1876 ఒక మైలురాయి. ఆరోజు అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ తాను రూపొందించిన టెలిఫోన్‌ ద్వారా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తొలి మాటలు కమ్‌ హియర్‌ వాట్సాన్, ఐ వాంట్‌ యూ!. యూరోపియిన్‌ కమిషన్‌ అంచనాల ప్రకారం మానవ ఉపాధి అవకాశాల్లో 60 శాతం వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెలిఫోన్ల రంగంపై ఆధారపడి ఉంది. ఇంటర్నేషనల్‌ టెలిగ్రాఫ్‌ యూనియన్‌ 2006 సంవత్సరానికి ప్రమోటింగ్‌ గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీని లక్ష్యంగా ఎంచుకున్నది. గ్లోబల్‌ టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థ సుమారు 220 దేశాల్లో నిరాటంకంగా పనిచేస్తోంది. ఇప్పుడు భూమి మీదే కాకుండా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా సముద్రం లోపల కూడా విస్తరించింది. టెలిగ్రాఫ్, టెలెక్స్‌ టెలిఫోన్, టెలివిజన్‌ మొదలైన ప్రత్యేక వ్యవస్థలు ప్రత్యేక కేబుల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేస్తున్నాయి.

ఒకప్పుడు తీగెల ఆధారంగా టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ పనిచేసేది.  నేడు వైర్‌లెస్, సెల్‌ఫోన్‌ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. నేడు సెల్‌ఫోన్‌ లేని వ్యక్తి లేడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నవారితో క్షణాల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, ఛాటింగులు చేయడం, వీడియో కాల్‌ చేయడం, వీడియోలు పంపడం సులభతరంగా మారాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అన్ని రకాల సెల్‌ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. కొండలు, గుట్టలపైన కూడా సెల్‌ఫోన్లు పనిచేస్తున్నాయి. సెల్‌ఫోన్‌ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవసరం మేరకే ఫోన్లను వాడితే మంచిది. అనవసర కబుర్లను ఫోన్‌లో కాకుండా నేరుగా మాట్లాడుకోవడమే మేలు.
(నేడు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం సందర్భంగా)

           -కామిడి సతీష్‌ రెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 

మరిన్ని వార్తలు