గర్భిణుల్లో అపోహలను తొలగించాలి

6 Mar, 2019 11:35 IST|Sakshi
సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్‌ సీతాకుమారి

భట్టిప్రోలు పీహెచ్‌సీ డాక్టర్‌ సీతాకుమారి 

సాక్షి, భట్టిప్రోలు: గర్భిణుల్లో నెలకొన్న అపోహలను వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తొలగించాలని భట్టిప్రోలు పీహెచ్‌సీ డాక్టర్‌ ఎ.సీతాకుమారి సూచించారు. పీహెచ్‌సీలో మంగళవారం ఆశాడే నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాకుమారి మాట్లాడుతూ  వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి గర్భిణుల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాన్పులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరిగేలా చూడాలని కోరారు. బాలింతలు ఈ సేవలు పొందేందుకు 102 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. 

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి
వెల్లటూరు పీహెచ్‌సీలో నిర్వహించిన ఆశాడే సమావేశంలో డాక్టర్‌ సీహెచ్‌ రామలక్ష్మి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. ఈ నెల 10వ తేదీన నిర్విహించనున్న సామూహిక పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.  

Read latest Guntur News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు