గింజధాన్యాలతో గుండె జబ్బులు దూరం

21 Oct, 2016 00:31 IST|Sakshi
గింజధాన్యాలతో గుండె జబ్బులు దూరం

ఆహారంలో గింజధాన్యాలు సమృద్ధిగా తీసుకునే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, నెస్లేలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో రక్తపోటును సమర్థంగా నియంత్రించేందుకు గింజధాన్యాలు ఉపయోగపడతాయని, తద్వారా గుండెజబ్బులతో వచ్చే మరణాలను నివారించవచ్చునని తేలింది. యాభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి... ఊబకాయంతో ఉన్న వారిపై ఈ అధ్యయనం జరిగింది.

కొందరికి గింజధాన్యాలు, మరికొందరికి శుద్ధి చేసిన ధాన్యాలను ఆహారంగా అందించారు. అధ్యయనం మొదట్లో, చివరలోనూ వారి జీవక్రియలపై క్షుణ్నంగా పరీక్షలు నిర్వహించారు. బీపీ కోసం మందులు తీసుకుంటున్న వారికి వాటిని కొనసాగించాల్సిందిగా సూచించారు. 8 వారాల తరువాత జరిపిన పరిశీలనలో గింజధాన్యాలు తిన్న వారిలో డయాస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ (రెండు లబ్‌డబ్‌లకు మధ్యలో గుండె రిలాక్స్ అవుతున్నప్పుడు ఉండే అతితక్కువ పీడనం) మూడు రెట్లు ఎక్కువైనట్లు గుర్తించారు. ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందనేందుకు సూచన.
 

Read latest Health News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా