శంషాబాద్లో 1.3 కిలోల బంగారం పట్టివేత

7 Sep, 2015 09:08 IST|Sakshi

శంషాబాద్: శంషాబాద్  అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.3 కిలోల బంగారం బయటపడింది. ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ దగ్గర భారీగా బంగారం లభించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు 1.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదనపు వివరాల కోసం మహిళను విచారిస్తున్నారు.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు