విజయవాడ- తెనాలి-గుంటూరు

15 Dec, 2016 16:28 IST|Sakshi
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరువలో ఉన్న నగరాలను కలుపుతూ ప్రత్యేక ట్రైన్ ను వేయాలని గురువారం ఏపీ సర్కారు నిర్ణయించింది. మొత్తం 125 కిలోమీటర్ల పాటు ఉండనున్న ఈ మార్గానికి రూ.10వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రత్యేక ట్రైన్ విషయంపై సీఆర్ డీఏ అధికారులతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు ఆమోదం తెలిపారు.
 
దీంతో పాటు విశాఖపట్టణం మెట్రో అలైన్ మెంటుకు కూడా ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది. మొత్తం నాలుగు కారిడార్లతో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్ఏడీ జంక్షన్ నుంచి బొమ్మది, గాజువాక జంక్షన్ లకు రెండు కారిడార్లు, గురుద్వారా నుంచి పోస్టాఫీసుకు, తాడిచెట్టపాలెం నుంచి చినవాల్తేరుకు మరో రెండు కారిడార్లను నిర్మించనున్నారు.
మరిన్ని వార్తలు