వెన్నతో అల్జీమర్స్‌కు స్వస్తి!

11 Jul, 2015 08:27 IST|Sakshi
వెన్నతో అల్జీమర్స్‌కు స్వస్తి!

రియో డిజనిరో: పాలను నుంచి వేరుచేసిన లినోలిక్ ఆమ్లంతో కూడిన  వెన్నను తింటే అల్జీమర్స్‌ను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వెన్నను తింటే  జ్ఞాపకశక్తికి కారణమయ్యే ఎంజైమ్ 'ఫోస్‌ఫోలిపాస్ ఏ2' పనితీరు మెరుగవుతుందని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో శాస్త్రవేత్తలు తెలిపారు. జ్ఞాపకశక్తికి కారణమయ్యే కణత్వచాల నిర్మాణంలో పాలుపంచుకునే కొవ్వుఆమ్లాలపై ఈ ఎంజైమ్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్యవంతుల్లో ఈ కణత్వచాలు ఎప్పటికప్పుడూ మారుతూ, కొత్తవి ఏర్పడుతాయి. అదే అల్జీమర్స్ రోగుల్లో కొవ్వు ఆమ్లాలు బంధించి ఉండటం వల్ల కణత్వచాలు స్తబ్దుగా ఉంటాయని పేర్కొన్నారు. ఎలుకలపై ఐదేళ్లు పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు.
 

మరిన్ని వార్తలు