సీబీఐకి చిక్కిన ఎయిర్‌పోర్టు డెరైక్టర్

25 Jul, 2015 02:38 IST|Sakshi
సీబీఐకి చిక్కిన ఎయిర్‌పోర్టు డెరైక్టర్

కడప అర్బన్:  వైఎస్‌ఆర్ జిల్లా కడపలో నూతనంగా ఏర్పాటైన విమానాశ్రయం డెరైక్టర్ శ్రీనివాసన్ శుక్రవారం రూ. 25 వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు. కడపకు చెందిన ముసాబిక్ అహ్మద్ ఎయిర్‌పోర్టు ప్రారంభ సమయంలో కూలీలతో కొన్ని పనులు చేయించాడు. ఇందుకు సంబంధించిన బిల్లు మంజూరు చేసేందుకు ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శ్రీనివాసన్ రూ. 25 వేలు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వనిదే బిల్లు మంజూరు చేయనని తేల్చి చెప్పడంతో కాంట్రాక్టర్ సీబీఐ అధికారులను సంప్రదించాడు.

ఈ నేపథ్యంలో హైదరాబాదు నుంచి వచ్చిన సీబీఐ బృందం ఎయిర్‌పోర్టు అథారిటీ కార్యాలయం వద్ద మోహరించింది. సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాసన్‌కు రూ. 25 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీనివాసన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు