విద్యుత్ ఉద్యోగుల విభజనపై కదలిక

9 Jul, 2015 01:34 IST|Sakshi

31న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈ నెల 31న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంధన శాఖ కార్యదర్శులు, జెన్‌కో సీఎండీలకు పిలుపు వచ్చింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి అధికారులకు లేఖలు అందాయి.

ఏపీ స్థానికత కలిగి ఉండి తెలంగాణలో పనిచేస్తున్న 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు గత నెల 10న రిలీవ్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోడానికి మొదట హోంశాఖ అయిష్టత వ్యక్తం చేసినా, ఎట్టకేలకు స్పందించడం విశేషం.
 

>
మరిన్ని వార్తలు