సీఎం తిరుపతి పర్యటన రద్దు

2 Dec, 2015 10:00 IST|Sakshi
సీఎం తిరుపతి పర్యటన రద్దు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రద్దు అయింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు. బుధవారం తిరుపతిలో జరుగుతున్న స్విమ్స్ 6వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గోనాల్సి ఉంది. అనంతరం వర్షాల కారణంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించి, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పొల్గొనేందుకు తిరుపతి వెళ్లాల్సి ఉండగా వర్షాలు కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు.
 
ఈ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి  ఇబ్బందులు పడకుంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 

 

మరిన్ని వార్తలు