మరో రెండు రోజులు చలి వాతావరణం

18 Feb, 2017 10:03 IST|Sakshi

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు చలి వాతావరణం కొనసాగనుంది. భూ ఉపరితలం పొడిగా మారటం వల్ల రాత్రి సమయాల్లో చలి వాతావరణం ఉంటున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో 15, 16 డిగ్రీల స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు