'రూ. వేల కోట్ల అవినీతిని అడ్డుకునేందుకే..'

14 Mar, 2016 11:30 IST|Sakshi
హైదరాబాద్: మిషన్ భగీరథలో జరుగుతున్న రూ. వేల కోట్ల అవినీతిని అడ్డుకునేందుకే పలు కేంద్ర సంస్థలకు లేఖ రాసినట్టు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ మిషన్ భగీరథ అంచనాలను ఆంధ్రా కాంట్రాక్టర్ ఖరారు చేశారన్నారు. రూ. 30 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 వేల కోట్లు ఆదా చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తప్పులు ఎత్తి చూపితే సీఎం కేసీఆర్ ఉలికిపడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాపాలు చేసిందంటున్న కేసీఆర్ తెలంగాణ ఇచ్చి కాంగెస్ తప్పు చేసిందో లేదో చెప్పాలన్నారు. 
 
మరిన్ని వార్తలు