ఎంఐఎం అవకాశవాద పార్టీ: వీహెచ్

26 Dec, 2015 15:15 IST|Sakshi

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు.. ఒవైసీ కుటుంబం మీద, ఎంఐఎం పార్టీ మీద విరుచుకుపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఐఎం అవకాశవాద పార్టీ అని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా లాభపడిందని..కానీ ఇప్పుడు టీఆర్ఎస్ గెలవగానే ఆ పార్టీ పంచన చేరిందని అన్నారు.

కాంగ్రెస్ వల్ల దారూసలాంతోపాటు ఒవైసీ కుటుంబానికి పలు విద్యాసంస్ధలు చేకూరాయని, అలాంటి ఒవైసీ కుటుంబం పేద ముస్లింలకు చేసిందేమిటో చెప్పాలని ఆయన పశ్నించారు. ఆ మాటకొస్తే అసలు ఒవైసీ కుటుంబానిది హైదరాబాదే కాదని అన్నారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా ఎంఐఎం ఏనాడూ పట్టించుకోలేదని వీహెచ్ దయ్యబట్టారు.

>
మరిన్ని వార్తలు