ఏటీఎంలో దొంగనోట్లు

8 Mar, 2016 10:34 IST|Sakshi

ఖర్చుల కోసం డబ్బులు తీయడానికి ఏటిఎంకు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు తన ఎకౌంట్‌లో నుంచి రూ. 9 వేలు డ్రా చేశాడు. కిరాణ దుకాణంలో బిల్లు చెల్లించడానికి డబ్బులు ఇవ్వగా.. షాపు యజమాని మీరు ఇచ్చింది 'దొంగ నోటు సార్..' అని చెప్పడంతో షాక్ తిన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగ నోట్లే అని తేలడంతో.. లబోదిబో మనుకుంటూ బ్యాంకు అధికారులను ఆశ్ర యించాడు.

బ్యాంకు అధికారులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని ఏటీఎంల నిర్వాహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలసలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ ఉపాధ్యాయుడు భీమిలి రోడ్డులోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలోగల ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ. 9 వేలు డ్రా చేశాడు. అనంతరం అవన్ని దొంగనోట్లు అని తేలడంతో.. అవాక్కై బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించినా లాభం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు