'త్వరలో బీబీ నగర్ ఎయిమ్స్‌కు నిధులు'

10 Feb, 2016 10:14 IST|Sakshi

నల్లగొండ: బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి హోదాలో యాదాద్రి నరసింహుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. త్వరలో యాదాద్రిని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని.. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అనంతరం ఆయన ఆలేరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే కుల వృత్తి సమావేశంలో నడ్డా పాల్గొంటారు.
 

మరిన్ని వార్తలు