శ్రీకాళహస్తి-నడికుడి లైన్‌కు రూ.276 కోట్లు

5 Jan, 2016 18:37 IST|Sakshi

హైదరాబాద్ : శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం నిర్మాణం కోసం భూసేకరణకు గాను రూ.276.01 కోట్లను మంగళవారం ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పెట్టుబడులను రాబట్టేందుకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం పనుల వ్యయంలో 50 శాతం నిధులు, భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చితే ఆ ప్రాజెక్టును చేపట్టడానికి సిద్ధమని ఏడేళ్ల క్రితమే రైల్వే శాఖ ప్రతిపాదించింది.

ఆ ప్రతిపాదనకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. నెల్లూరు,గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు అధికారులను ఆదేశించింది. నెల్లూరు జిల్లాలో 2,901.54 ఎకరాల భూమిని సేకరించడానికి రూ.271.06 కోట్లను మంజూరు చేయాలని కలెక్టర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వం మంగళవారం నిధులను మంజూరు చేసింది.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు