మెస్సేజ్ వచ్చింది.. లారీ వదిలేయ్

23 Jul, 2015 01:16 IST|Sakshi
మెస్సేజ్ వచ్చింది.. లారీ వదిలేయ్

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రవాణా శాఖ మంత్రి కనుసన్నల్లో కొందరు తెలుగు తమ్ముళ్లు జోరుగా అధికలోడుతో గ్రానైట్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీనికి ‘కేరాఫ్ టీఆర్ మినిస్టర్’ అని ఆర్టీఏ అధికారుల సెల్‌ఫోన్లకు మంత్రి అనుచరుల వాహనాల నంబర్ల మెసేజ్ రావటమే నిదర్శనం. ఆ మెసేజ్‌ను నెల్లూరు, ప్రకాశం జిల్లా ఉపరవాణా కమిషనర్ మొబైల్‌కు పంపినట్లు తెలిసింది. మెసేజ్‌తో అలర్ట్ అయిన డీటీసీ.. ఆలస్యం చేయకుండా కిందిస్థాయి అధికారుల సెల్‌ఫోన్లకు వాహనాల నంబర్ల మెసేజ్ ను పంపినట్లు తెలుస్తోంది.

సాధారణంగా మామూళ్ల మత్తులో చూసీచూడకుండా వ్యవహరించే అధికారులు.. మంత్రి నుంచి మెసేజ్ వచ్చిందని ప్రచారం జరగటంతో మిన్నకుండిపోతున్నారు. ప్రకాశం, గుంటూరుతో పాటు ఇతర తెలంగాణ జిల్లాల నుంచి చెన్నై, కృష్ణపట్నం, కర్ణాటక రాష్ట్రాలకు గ్రానైట్ రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి నిత్యం 300 వాహనాలకుపైగా నెల్లూరు మీదుగా వెళ్తున్నాయి. అయితే వాటిలో పరిమితికి మించి అధికలోడుతో గ్రానైట్‌ను తరలిస్తున్నారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి నుంచి గ్రానైట్‌ను తరలించే తమ వాహనాలపై కేసులు రాయకుండా ఉండేం దుకు కొందరు తమ్ముళ్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావును ఆశ్రయించినట్లు తెలిసిం ది. ఈ నేపథ్యంలో కొన్ని నంబర్లను రవాణా అధికారులకు ఫోనులో మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు