హెచ్‌డీఎఫ్‌సీ దీపావళి శుభవార్త

7 Nov, 2018 13:03 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ : డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా : ఎంసీఎల్‌ఆర్‌ రేటు పెంపు

సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌  దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ దీపావళి  సందర్భంగా వినియోగదారులకు  గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందించే  వడ్డీరేటును  పెంచుతూ  ప్రకటన విడుదల చేసింది.  కోటి  రూపాయల లోపు  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై  చెల్లించే వడ్డీరేటును  50 బేసిస్‌ పాయింట్లను పెంచుతున్నట్టు మంగళవారం  ప్రకటించింది.  దీంతో ఎనిమిది నుంచి పది సంవత్సరాల కాల పరిమితి గల  డిపాజిట్లపై వడ్డీరేటు 6.5 శాతానికి  చేరింది.  3-5 సంవత్సరాల డిపాజిట్ల వడ్డీరేటు 7.25 శాతానికి, వార్షిక డిపాజిట్లపై అందించే రేటు 7.3 శాతానికి చేరింది. ఈ సవరించిన రేట్లు నిన్నటినుంచే అమల్లోకి వచ్చాయి.

మరోవైపు  ప్రభుత్వం రంగ బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్‌  బరోడా  రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ  నిర్ణయం తీసుకుంది. తమ వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది.  దీంతో బీవోబీ ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.20శాతం నుంచి 8.30శాతానికి చేరింది. ఈ సవరించిన వడ్డీరేటు నేటి(నవంబరు 7, బుధవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు