ప్రత్యూషపై ఆస్తి కోసమే దాడి జరిగిందా?

13 Jul, 2015 14:18 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని నాగోల్ లో కన్నతండ్రి, పినతల్లి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రత్యూష కేసును సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రత్యూష మానసిక, శారీరక స్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఆస్తుల కోసమే ప్రత్యూషపై దాడి జరిగిందా అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేసుపై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

సవతితల్లి పైశాచికత్వానికి తీవ్రగాయాలపాలైన ప్రత్యూష ప్రస్తుతం సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసులో పోలీసులు చాముండేశ్వరిని అరెస్టు చేయగా, ప్రత్యూష తండ్రి రమేష్ ఇంకా పరారీలో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు