శాస్త్రి మరణంపై పత్రాలను బయటపెట్టండి

10 Jul, 2015 01:21 IST|Sakshi
శాస్త్రి మరణంపై పత్రాలను బయటపెట్టండి

వారణాసి: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన అధికారిక పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. శాస్త్రి మరణానికి దారితీసిన పరిస్థితులపై పలు కథనాలు ఉన్నాయని, వీటిని నివృత్తిచేయాల్సి ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వానికి మూడుసార్లు దీనిపై విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. 1966 జనవరి 11న తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌తో జరిగిన తాష్కెంట్ ఒడంబడికపై సంతకం చేసిన తర్వాత రోజు శాస్త్రి కన్నుమూశారు. అయితే గుండెపోటుతో శాస్త్రి కన్నుమూశారని వెల్లడించినా.. ఆయన మరణం వెనుక కుట్ర దాగి ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు