రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా

24 Oct, 2015 02:44 IST|Sakshi

- దసరా ముందు రోజు ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. వీలైనంత ఎక్కువగా మద్యాన్ని తాగించడం ద్వారా ఎక్కువ ఆదాయం అర్జించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చౌక మద్యం పేరుతో చీప్ లిక్కర్‌కు దసరా ముందు రోజు గేట్లు తెరిచింది. అందుకనుగుణంగా తక్కువ రకం మద్యం ధరలపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్‌ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొన్ని రకాల మద్యంపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్‌ను పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీంతో తక్కువ రకం మద్యం ధరలు మరింత తక్కువ కానుండడంతో పాటు విక్రయాలు పెరిగి ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరగనుంది. ప్రస్తుతం 90 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా 60 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి 60 మిల్లీ లీటర్ మద్యం రూ.20 లకే లభ్యం కానుంది.

మరిన్ని వార్తలు