వ్యాపమ్ స్కామ్‌లో దోషులను వదలం

3 Aug, 2015 02:34 IST|Sakshi
వ్యాపమ్ స్కామ్‌లో దోషులను వదలం

న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కామ్‌లో ఒక్క దోషిని కూడా వదలిపెట్టేదిలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. తన రాజీనామాకు కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను ఆదివారం తోసిపుచ్చారు. 2013లో ఈ స్కామ్‌ను గుర్తించి తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించింది తానేనని తెలిపారు. కేసు సంక్లిష్టత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తుకోసం టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేశామన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ హైకోర్టు నియమించిన సిట్ కింద పనిచేస్తోందని వివరించారు. రాష్ట్రంలో జరిగిన లక్షలాది ఉద్యోగ నియామకాల్లో కేవలం కొన్ని వందల కేసుల్లో మాత్రమే అవకతవకలు జరిగాయని, ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలోనే తాను ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా వదిలేదిలేదని ఆయన స్పష్టంచేశారు.
 

మరిన్ని వార్తలు