అమెరికా సైనిక స్థావరాలపై కాల్పులు

18 Jul, 2015 00:34 IST|Sakshi
అమెరికా సైనిక స్థావరాలపై కాల్పులు

నలుగురు మెరైన్ల మృతి; దుండగుడి ఆత్మహత్య
చట్టనూగా(అమెరికా): అమెరికాలో మరోసారి కాల్పుల విష సంస్కృతి పంజా విసిరింది. టెన్నెసీ రాష్ట్రంలోని చట్టనూగా నగరంలో ఉన్న రెండు సైనిక స్థావరాలపై మొహమ్మద్ యూసఫ్ అబ్దుల్ అజీజ్ (24) అనే దుండగుడు గురువారం కాల్పుల మోత మోగించాడు. నలుగురు మెరైన్లు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. కాల్పుల తర్వాత సైనికులు ఎదురుకాల్పులు ప్రారంభించగా దుండగుడు తనను తాను కాల్చుకొని మరణించాడు.

ఈ ఘటనను దేశీయ ఉగ్రవాద చర్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. కువైట్‌లో పుట్టిన అజీజ్ 2012లో టెన్నెసీ వర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ పొందాడు. 2009లో టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్‌హుడ్ స్థావరంలోకి చొరబడిన ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతిచెందగా, 2013లో వాషింగ్టన్‌లోని నేవీ యార్డ్‌లోకి చొరబడిన ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు