'వచ్చేనెలలో నామినేటెడ్ పదవుల భర్తీ'

19 Aug, 2015 13:58 IST|Sakshi

తాండూరు: తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ వచ్చే నెలలో చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరులో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డులో కిలో రూ.20కే ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు