రాహుల్ వస్తున్నాడనే..నోటిఫికేషన్

27 Jul, 2015 12:50 IST|Sakshi

హైదారాబాద్: లక్ష ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలనే డిమాండ్‌తో ఉస్మానియూ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం ర్యాలీలు నిర్వహించారు. అశోక్ నగర్ గంథ్రాలయం నుంచి సచివాలయం వరకు... ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తా వరకూ ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఓయూకు వస్తున్నాడనే భయంతోనే సర్కారు కేవలం 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని విద్యార్థులు విమర్శించారు. అది కూడా కానిస్టేబుళ్లు, క్లర్కులు తదితర ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేశారని, గ్రూప్స్, ఎగ్జ్యిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ వారు చేశారు.

మరిన్ని వార్తలు