అస్మా మృతదేహం వెలికితీత - పోస్టుమార్టం

10 Mar, 2016 14:33 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంకొప్పర్తికి చెందిన అస్మా(6) అనే చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. అస్మా మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం తహశీల్దార్, రూరల్ సీఐ ఆధ్యర్యంలో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్, మస్తానీ దంపతుల కుమార్తె అస్మా(6) ఈనెల 6వ తేదీ అదృశ్యమైంది.

ఎక్కడ వెదికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారిని తన భర్తే హత్యచేసి పూడ్చిపెట్టాడని అదే గ్రామానికి చెందిన ఓబులేశు బార్య పోలీసులకు చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం మధ్యాహ్నం తను పూడ్చిపెట్టిన చోట తవ్వి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 


 

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు