'రోడ్ మ్యాప్ రాగానే అమరావతికి వెళ్లేందుకు సిద్ధం'

9 Aug, 2015 14:06 IST|Sakshi

గుంటూరు: రాజధానిపై రోడ్ మ్యాప్ వెలువడిన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ రెవెన్యూ ఉద్యోగులందరూ అమరావతికి తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పప్పరాజు వెంకట్ అన్నారు. ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ రెవెన్యూ ఉద్యోగులు ఎవరైనాసరే ఇసుక తవ్వకాలు, భూకబ్జాలను అడ్డుకునే క్రమంలో పోలీసుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఖాళీగా ఉన్న రెవెన్యూ పోస్టులను వెంటనే భర్తీచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురంలో నకిలీ పాసుపుస్తకాలు సృష్టించినవారికి సంఘం మద్దతు ఉండదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎన్జీవోలు చేస్తున్న పోరాటానికి సహకరిస్తామన్నారు. హోదా కల్పించకపోతే టీడీపీ, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు