వారంలో డేటా ఇవ్వండి

24 Jul, 2015 01:01 IST|Sakshi
వారంలో డేటా ఇవ్వండి

* ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్‌డేటా సమర్పణకు సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు వారం గడువిచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి, సెల్యూలర్ ఆపరేటర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారాన్ని ఈ నెల 24లోపు ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. సీఓఏఐతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్, ఐడియా తదితర సంస్థలు విడిగా వేసిన పిటిషన్లన్నీ జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ శివ కీర్తిసింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.

సర్వీసు ప్రొవైడర్ల తరఫు న్యాయవాది కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ‘ఏపీ, తెలంగాణల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నడుస్తోంది. వారి మధ్య సర్వీసు ప్రొవైడర్లు నలిగిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సర్వీసు ప్రొవైడర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు, ఏయే ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారో ఆయా వివరాలను ఇవ్వాలని ఆ దర్యాప్తు బృందం సర్వీసు ప్రొవైడర్లను కోరింది. ఆ డేటా ఇస్తే అధికార రహస్యాల చట్టం కింద న్యాయవిచారణ ఎదుర్కోవలసి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం సంబంధిత డేటా ఎవరికీ ఇవ్వరాదన్నది. విజయవాడ కోర్టు ఈ డేటా ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. రెండు ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు సర్వీసు ప్రొవైడర్లను వేధిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
 
అది చట్టబద్ధం కాని ట్యాపింగ్: ఏపీ
ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బసవ ప్రభుపాటిల్, పి.పి.రావు తమ వాదనలు వినిపిస్తూ ‘అక్కడ చట్టబద్ధం కాని ట్యాపింగ్ జరిగింది. దర్యాప్తులో భాగంగా అవసరమైన డాక్యుమెంట్లు, డేటాను సీల్డ్‌కవర్‌లో సమర్పిస్తే వచ్చే నష్టం ఏముంది?’ అని పేర్కొన్నారు.
 
హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం..
రిట్ పిటిషన్లు ఉపసంహరణకు అవకాశం ఇస్తూ.. ‘విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు సీల్డ్‌కవర్‌లో డేటాను ఇచ్చేందుకు మరో వారం గడువు ఇ స్తున్నాం. ఆ కోర్టు దానిని స్వీకరించిన త ర్వాత వారాల వరకు తెరవకూడదు. అ లాగే మొత్తం నాలుగు వారాల వరకు కోర్టు తన వి చారణను ఆపాలి’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

మరిన్ని వార్తలు