తగ్గనున్న స్మార్ట్‌ఫోన్, సిమెంట్‌ ధరలు

23 May, 2017 02:56 IST|Sakshi

న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో స్మార్ట్‌ఫోన్లు, వైద్య పరికరాలు, సిమెంట్‌ ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లపై సగటున 13.5 శాతం పన్ను ఉండగా.. జీఎస్టీలో 12 శాతమే వసూలు చేస్తారని ఆర్థిక శాఖ తెలిపింది.

ఇక వైద్య పరికరాలపై ప్రస్తుతమున్న 13 శాతం పన్నును 12 శాతంగా నిర్ణయించారని, సిమెంట్‌పై 28 శాతం(ప్రస్తుతం 31 శాతం) జీఎస్టీ వసూలు చేస్తారని వెల్లడించింది. ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి, బయో కెమికల్‌ విధానంలో వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని 12 శాతం(ప్రస్తుతం 13 శాతం)గా నిర్ణయించినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు