ఎన్టీఎస్ఈ ఫలితాల్లో శ్రీ చైతన్య క్లీన్ స్వీప్

17 Feb, 2016 05:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎస్ఈ) స్టేజ్-1 పరీక్షల ఫలితాల్లో స్టేట్ మొదటి ర్యాంకు నుంచి వరుసగా 20 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించి క్లీన్స్వీప్ చేశారని ఆ విద్యా సంస్థల అకాడమిక్ డెరైక్టర్ సీమ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా 103 మంది విద్యార్థులు ఒక్క శ్రీ చైతన్య స్కూల్ నుంచే ఎంపికయ్యారని ఆమె వెల్లడించారు. తమ విద్యార్థులైన ఎం.కౌషిక్, కె.రోహిత్ రెడ్డిలు స్టేట్ మొదటి ర్యాంకును, ఎ.కల్యాణ్ నాయక్, ఎ.భరత్ స్టేట్ రెండో ర్యాంకును సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు మాట్లాడుతూ ఎన్టీఎస్ఈలో గత ఐదేళ్లుగా శ్రీ చైతన్య విద్యార్థులే అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పటిష్టమైన రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ వల్లే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధించినట్లు ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు