వనస్థలిపురంలో కిడ్నాప్ కలకలం

30 Sep, 2015 10:05 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న విద్యార్థి చందూని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు అక్కడ చందూ పై దాడి చేసి చితక బాదారు. చందూ కిడ్నాప్ కు గురైనట్టు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.

విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు సకాలంలో చందూ ఆచూకీ కనిపెట్టారు. కిడ్నాపర్ల దాడిలో తీవ్రగాయాలపాలైన చందూను హాస్పటిల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో చందూ ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు