'పారదర్శకత' ఓ పరిమితి మేరకే సాధ్యం: సుప్రీం

9 Jul, 2015 08:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకంలో పారదర్శకతను ఒక పరిమితికి మించి పాటించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. 'ఒక వ్యక్తి కులాభిమాని, మతాభిమాని లేదా నిజాయితీ లేని వ్యక్తి అయినా కూడా.. నియామకాలకు పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని ఎలా నిరూపిస్తారు?' అని ప్రశ్నించింది.  కొలీజియం స్థానంలో న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. కొలీజియం న్యాయ నియామకాల్లో మరింత పారదర్శకత తేవాలని న్యాయవాది రామ్‌జఠ్మలానీ వాదించినపుడు సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.

మరిన్ని వార్తలు