ద రోబో ‘నర్స్’

31 Jul, 2015 03:57 IST|Sakshi
ద రోబో ‘నర్స్’

రిమోట్ తీసుకురా.. అనగానే టక్కున ఇచ్చేస్తుంది.. నీరు కావాలంటే వెంటనే అందిస్తుంది.. పెన్ను, పేపర్ తీసుకురమ్మంటే రయ్‌మని తెచ్చిస్తుంది.. ఇంతకీ ఇవన్నీ చేసేదెవరనుకుంటున్నారా..! రోబో..! అవును రోబోనే.. ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి పెట్టేందుకు కూడా సిద్ధమైంది. టొయోటో కంపెనీ ప్రత్యేకంగా ఈ రోబోను తయారుచేసింది. వస్తువు ఎక్కడుందో కమాండ్ ఇస్తే చాలు దానికున్న చేతితో తీసుకొచ్చిస్తుంది. 4 అడుగుల 4 అంగుళాలు ఉండే ఈ రోబో.. చిన్న కాగితపు ముక్క నుంచి దాదాపు 1.2 కిలోల బరువున్న ఏ వస్తువునైనా మోయగలుగుతుంది.
 
దీనికున్న కెమెరాలు, స్కానర్ల సాయంతో గదిలో ఏక్కడ ఏ వస్తువున్నా వెంటనే గుర్తుపట్టగలుగుతుంది. గంటకు దాదాపు 800 మీటర్ల వేగంతో మాత్రమే నడవగలిగే ఈ రోబోను ఎక్కడినుంచైనా ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ సాయంతో ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు వృద్ధులకు, వికలాంగులకు, ఆస్పత్రుల్లోని రోగులకు ఈ రోబోలు ఎంతో ఉపయోగపడతాయి కూడా.

మరిన్ని వార్తలు